నేచురల్ స్టార్ నాని అంటే మినిమం గ్యారెంటి హీరో. అయితే భలే భలే మగాడివోయ్ సినిమాకు ముందు హీరో నాని ని వరుసగా ఫ్లాపులు పలకరించాయి. అలాంటి టైమ్ లో మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని తన కెరీర్ కు మంచి టర్నింగ్ ఇచ్చుకున్నాడు. అక్కడి నుంచి వరుసగా సక్సెస్ లు స్టార్ట్ అయ్యాయి. కానీ మళ్లీ ఈ మధ్య ఫ్లాపులు పలకరిస్తున్నాయి. కృష్ణార్జున యుద్దం, దేవదాస్ డిజాస్ట్రస్ గా నిలిచాయి. జెర్సీ సినిమాకు క్రిటికల్ అప్రిసియేషన్ వచ్చింది కానీ, బయ్యర్లకు లాస్ తప్పలేదు. 

ఇక నాని లేటెస్ట్ గా గ్యాంగ్ లీడర్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరక్షన్ లో సైకో కిల్లర్ గా 'వి' సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత మరో రెండు మూడు కొత్త ప్రాజెక్టులు లైన్ లో వున్నాయి. వాటిల్లో శివనిర్వాణ ప్రాజెక్టు ఒకటి. అయితే ఇది ఇంకా ఫైనల్ కావాల్సి వుంది. అందువల్ల నానికి గ్యాంగ్ లీడర్ సినిమా ఓ విధంగా టెస్ట్ అనుకోవాలి. ఇది హిట్ అయితేనే, నాని నెక్స్ట్ సినిమాల ఓపెనింగ్స్ బాగుంటాయి. లేదంటే కంప్లీట్ గా నాని మార్కెట్ పడిపోవడం ఖాయం.
ఇక మైత్రీ మూవీస్ కు కూడా గ్యాంగ్ లీడర్ సినిమా పెద్ద టెస్ట్ అనే చెప్పాలి. సవ్యసాచి, డియర్ కామ్రేడ్ సినిమాలకు బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల గ్యాంగ్ లీడర్ సినిమా మార్కెటింగ్ కు సమస్య రాలేదు. కానీ ఈ సినిమా హిట్ అయితేనే మైత్రీకి కూడా బాగుంటుంది. లేదంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మైత్రీ బ్యానర్ లో ప్రస్తుతానికి ఉప్పెన సినిమా ఒక్కటే ఉంది. బన్నీ-సుకుమార్ సినిమా స్టార్ట్ కావాల్సి వుంది. వరుస పరాజయాల బ్యాడ్ నేమ్ నుంచి తప్పించుకుని, మైత్రీ మళ్లీ ట్రాక్ మీదకు రావాలంటే గ్యాంగ్ లీడర్ ఎట్టి పరిస్థితుల్లోను హిట్ కొట్టి తీరాల్సిందే. 

అంతేకాదు డైరక్టర్ విక్రమ్ కే కుమార్ కు ఈ సినిమా గట్టి పరీక్షనే విషయం కూడా తెలిసిన సంగతే. మనం సినిమా తరువాత కమర్షియల్ సక్సెస్ విక్రమ్ కుమార్ కు దక్కనే లేదు. మంచి డైరక్టర్ అన్న ట్యాగ్ లైన్ వున్నా, కమర్షియల్ సక్సెస్ లేకపోతే వరుస ఫెయిల్యూర్ల తరువాత మరో సినిమా రావడం కష్టం అవుతుంది. అలా కాకుండా వుండాలి అంటే గ్యాంగ్ లీడర్ హిట్ కొట్టి తీరాలి. ఇక ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయకు ఓ హిట్టు కావాలి. ఇలా, హీరోకి, దర్శకుడికి, నిర్మాతలకు అంతా మంచి జరగాలంటే గ్యాంగ్ లీడర్ హిట్ కొట్టి తీరాల్సిందే. లేదంటే ఈ గ్యాంగ్ కి చాలా కష్టం. 


మరింత సమాచారం తెలుసుకోండి: