ప్రభాస్ సాహో సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.  ఆగష్టు 30 న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు 300 కోట్లపైనే వసూలు సాధించింది.  సినిమాపై నమ్మకం ఉన్నా రిలీజ్ ఆ తరువాత మాత్రం ఆ స్థాయిలో పేరు సంపాదించలేకపోయింది.  కాగా, ఇప్పుడు ఈ సినిమా ఎంతవరకు వసూళ్లు సాధిస్తుంది అనే దానిపైనే అందరి చూపులు ఉన్నాయి.  సినిమా పర్వాలేదనిపించినా వసూళ్లు ఇంకాస్త ఊరటనిచ్చేవి.  


అసలు సినిమా పెదద్గా లేదని టాక్ రావడం పెద్ద మైనస్ అయ్యింది.  ఇందులో ప్రభాస్ పాత్ర ఎంత కీలకమో.. శ్రద్ధా కపూర్ పాత్ర కూడా అంతే కీలకం.  శ్రద్ధా కపూర్ నటన చాలా బాగుందని టాక్ వచ్చింది.  సినిమా ఆ మాత్రం నిలబడింది అంటే శ్రద్ధా కపూర్ పాత్ర ఉండటం వలనే సినిమా నిలబడింది. ప్రభాస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఇదే మాట అన్నాడు.  


శ్రద్దా కపూర్ సినిమాలో ఉండటం మా అదృష్టం అని, ఆమె నటన సినిమా తరువాత మెచ్చుకుంటారని అన్నారు.  అన్నట్టుగానే సినిమాకు మంచి పేరు వచ్చింది.  పేరు రావడమే కాదు, సినిమాకు ఒకరకంగా ఈ మాత్రం వసూళ్లు వస్తున్నాయి అంటే దానికి ఆమె ఒక కారణం అని చెప్పొచ్చు.  ఇప్పుడు సినిమా రూమర్లను పక్కన పెడితే..శ్రద్దా తానూ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.  


శ్రద్దా కపూర్ సినిమా కోసం ఎంత వరకు ప్రయత్నించాలో అంతవరకూ ప్రయత్నం చేసింది.  సినిమాల్లో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి.  సినిమా రంగానికి వచ్చిన సమయంలో ఆమె ఎంతగా కష్టపడిందో చెప్పక్కర్లదు.  టాప్ ఆర్టిస్ట్ కూతురుగా కాకుండా ఆడిషన్స్ కు వెళ్లి సెలక్ట్ అయ్యి నేర్చుకొని ఆర్టిస్ట్ అయ్యింది.  అదే ఆమెకు కలిసి వచ్చింది.  హీరోయిన్ గాను అలానే సింగర్ గాను మంచి పేరు తెచ్చుకున్నది శ్రద్ధా కపూర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: