ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ సాహో కాస్తా మొదటి రోజు నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుని ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫలితాన్ని చూసి డైరెక్టర్ మరియు నిర్మాతలు భోరుమనలేదు సరికదా ఇంకా ఆనందపడ్డారట. ఇంతకి అసలు విషయం ఏమిటంటే సాహో సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే సినిమా ఫ్లాప్ అయినా తమ కలెక్షన్లకు ఏమాత్రం గండి పడకుండా తెలివిగా చూసుకున్నారు మన సాహో చిత్రబృందం. వాళ్ళు అనుకున్న పాచిక సరిగ్గా పారింది మరి. ఎవరికీ అర్థం కాకుండా వారు తీసుకున్న జాగ్రత్త చూసి మిగతా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు చాలా నేర్చుకోవాల్సిందే.

ఇక్కడ విషయమేమిటంటే సాహో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. దీనంతటికి కారణం సాహో సినిమాని అసలు తీసిందే బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కావాడం వల్లనే. ఎన్నో నెగిటివ్ రివ్యూల మధ్య సాహో సినిమా హిందీలో నాలుగు రోజులు కలిపి మొత్తం 93 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ఈ టాక్ తో దాదాపు వంద కోట్లు తొలి నాలుగు రోజుల్లోనే కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ తర్వాత ఈ ఏడాది బాలీవుడ్ లో మొదటి రోజు ఆత్యదిక వసూళ్ళు సాదించిన చిత్రం ఇదే కావడం విశేషం. నాన్-హాలిడే రోజు రిలీజైన చిత్రాల్లో అయితే ఈ సంవత్సరానికి సాహో నే అత్యధికం.

ఇకపోతే సాహో సినిమాని మీరు గమనించినట్లయితే సుజిత్ సినిమా తీసేటప్పుడు తెలుగు ప్రేక్షకుల కన్నా బాలీవుడ్ ప్రేక్షకులను ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నట్లు పూర్తిగా అర్థమవుతుంది. సినిమాలోని పాటలు కూడా తెలుగులో అటు ఇటు గా ఉన్నా హిందీ లో మాత్రం చాలా బాగున్నాయి. ఆ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే, నటీనటులు, కాన్సెప్ట్ తో పాటు ప్రభాస్ మన తెలుగులో చేసిన ప్రమోషన్ లతో పోలిస్తే హిందీలో సినిమాకి మూడింతలు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. సినిమా ఎలా ఉన్నా తెలుగులో జనాలు చూస్తారు. బాలీవుడ్ అభిమానులను మెప్పిస్తేనే టాక్ కొంచెం అటు ఇటు అయినా నిర్మాతలు సేఫ్ అయ్యేది. ఒకవేళ బాలీవుడ్ అభిమానులకు నచ్చకుండా కేవలం తెలుగు అభిమానులకు నచ్చినా గట్టిగా ఒక 150 కోట్లు వచ్చుండేదేమో. కానీ ఇప్పుడు తెలుగులో వచ్చే 100 కోట్లు పైగా వసూళ్లు వస్తుండగా అక్కడ ఇంకో 150 కోట్లు టార్గెట్ వేశారు మన నిర్మాతలు. కాబట్టి ఇక నుండి భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలన్నీ సాహో నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: