మొదటి నాలుగు రోజులు టాక్ తో సంబందం లేకుండా ఓ రేంజ్ లో వసూళ్లను రాబట్టిన  సాహో ఐదవ రోజు వూహించనట్లుగానే బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.  తెలుగు రాష్ట్రాల్లో నైజాం తో సహా అన్ని ఏరియాల్లో  మంగళవారం కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి.  హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో  5వరోజు కేవలం 4,63,896 లక్షల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేసిందంటే  పరిస్థితి ఎలా  ఉందో అర్ధం చేసుకోవచ్చు. దానికితోడు ఇంతకుముందు అక్కడ  6 థియేటర్లలో ఈసినిమాను ప్రదర్శించగా ఇప్పుడు మూడు థియేటర్లకే పరిమితం అయ్యింది. 





ఇక నైజాం లో  సాహో, మంగళవారం కోటి రూపాయల షేర్ తో  5రోజుల్లో  24కోట్ల షేర్ ను రాబట్టి బాహుబలి 1&2 తరువాత  అల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.  ఇక  తమిళ , మలయాళ వెర్షన్ లు డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడగా  ఓవర్సీస్ లో కూడా అదే ఫలితాన్ని కొనసాగించింది. 
కాగా హిందీ వెర్షన్ మాత్రం అక్కడి ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ  అంచనాలకు మించి వసూళ్లను రాబడుతుంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 93 కోట్ల షేర్ ను రాబట్టగా  మంగళవారం 8కోట్ల షేర్ తో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈచిత్రం అక్కడ మరో 15కోట్ల వరకు రాబట్టొచ్చు.  





రెబల్ స్థార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా  350కోట్ల బడ్జెట్ తో  యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హై  వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కథానాయికగా నటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: