మిథాలీ రాజ్.. ఇండియన్ లేడీస్ క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఇది. మహిళా క్రికెట్ కు గుర్తింపు తీసుకొచ్చిన లేడీ. అందులోనూ మన హైదరాబాదీ.. అలాంటి ఈ అమ్మడు.. ఆటలకు క్రమంగా గుడ్ బై చెబుతోంది. భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ అంతర్జాతీయ ట్వంటీ ట్వంటీ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది.


అయితే ఈ నిర్ణయం... 2021లో వన్డే ప్రపంచకప్ పై మరింత దృష్టి పెట్టేందుకేనట. 36 ఏళ్ల మిథాలీరాజ్ 13 ఏళ్ల నుంచి భారత మహిళల క్రికెట్ ట్వంటీ 20 జట్టుకు ఆడుతోంది. ఇంటర్నేషనల్ కెరీర్ లో ఇప్పటి వరకూ మిథాలీ 89 ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడింది. టీ 20ల్లో ఆమె హయ్యెస్ట్ స్కోరు 97. యావరేజ్ 37.5. టీ 20ల్లో టోటల్ స్కోర్ 2364 పరుగులు. ట్వంటీ20ల్లో 32 మ్యాచ్ ల్లో మిథాలీ భారత జట్టుకు కెప్టెన్ గా ఉంది.


ట్వంటీ 20ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజే కావడం విశేషం. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్ పై చివరిసారిగా మిథాలీ ట్వంటీ మ్యాచ్ ఆడింది. ఓవరాల్ గా కెరీర్ లో 203 వన్డేల్లో 51.29 సగటుతో 6720పరుగులు పూర్తి చేసింది మిథాలీ.. 10 టెస్టుల్లో 663 రన్స్ చేసింది.


ఇక క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్న మిథాలీ 2021 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. స్పోర్ట్ ఉమన్ గానే కాకుండా బ్యూటీగా కూడా మిథాలీకి మంచి గుర్తింపు ఉంది. ఆమె గతంలో కొన్ని ఫోటో సెషన్స్ కూడా చేసింది. రిటైర్మెంట్ తర్వాత మిథాలీ సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: