మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'సైరా'. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలపాటు చిరంజీవి ఏకదాటిగా షూటింగ్ లో పాల్గొన్నారు. రాం చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ సంస్థ పై నిర్మించబడిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో అయితే చిరంజీవికి ఉన్న క్రేజ్ బట్టి ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోయినా పెద్ద ప్రమాదమేమీ సినిమాకి ఉండదు. ఎందుకంటే చిరంజీవి క్రేజ్ అలాంటిది. అయితే రామ్ చరణ్ 'సైరా' సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున విడుదల చేయాలని సినిమా స్టార్ట్ చేయకముందే డిసైడ్ అయ్యి ఈ సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారిని పెట్టుకోవడం జరిగింది.


ఇటువంటి నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ విషయంలో భయంకరమైన సవాళ్లు ఎదుర్కోబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి పెద్దగా ఉన్న క్రేజ్ ఏమీ లేదు...బాలీవుడ్ ప్రేక్షకులకు చిరంజీవి గురించి తెలిసింది ఏమైనా ఉందా అంటే..సౌత్ లో ఆయన ఒక లెజెండ్ హీరో అని మాత్రమే తెలుసు. ఇదే క్రమంలో పాతిక సంవత్సరాల తర్వాత చిరంజీవి స్ట్రైట్ గా సైరా సినిమా ని బాలీవుడ్ లో విడుదల చేయబోతున్న క్రమంలో అక్కడ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన సినిమా యూనిట్ లో నెలకొంది.


మరోపక్క చిరంజీవి 'సైరా' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే బాలీవుడ్ బిగ్ మల్టీస్టారర్ సినిమా వార్ విడుదల కానుంది. వారి సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టైగర్ షరాఫ్ కూడా నటించాడు. మొత్తం మీద బాలీవుడ్లో భారీ ఎత్తున విడుదల అవుతున్న 'సైరా' సినిమా...ఏ విధంగా ఈ ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి విజయాన్ని సాధిస్తుందో లేదో అన్న టెన్షన్ సినిమా యూనిట్ లో నెలకొన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: