దర్శకధీరుడు రాజమౌళి డైరక్షన్ లో నటించే ఛాన్స్ కోసం కేవలం టాలీవుడ్ నటీనటులే కాదు బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తుంటారు. బాహుబలితో బాలీవుడ్ కు షాక్ ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. 


ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుంది. ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఇంతకుముందే ప్రకటించిన అలియా భట్ ఇప్పుడు రాజమౌళి సినిమా ఛాన్స్ ముఖ్యం ఇక ఆ మూవీలో తన పాత్ర నిడివి ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పుకొచ్చింది. సినిమాలో అల్లూరి సీతారామరాజు భార్య పాత్రలో అలియా భట్ నటిస్తుంది. 


రాజమౌళితో కలిసి పనిచేయాలన్నది తన డ్రీమ్ అని ఆ మూవీలో తన పాత్ర ఎలా ఉన్నా పర్లేదని అంటుంది అలియా భట్. ఆర్.ఆర్.ఆర్ కోసం తెలుగు భాషను నేర్చుకుంటున్నారు అలియా భట్. తన మాత్రు భాషలా తెలుగుని మాట్లాడాలని అనుకుంటున్నా అయితే అది ఎంతవరకు కుదురుతుందో చెప్పలేని కాని ప్రయత్నిస్తున్నా అన్నారు అలియా భట్. 


ఇక ఇప్పటికే రాజమౌళి ఏర్పాటు చేసిన రిహార్సెల్స్ లో పాల్గొన్న అలియా భట్ ఈ షెడ్యూల్ లో రెగ్యులర్ షూట్ లో పాల్గొననుంది. ఎన్.టి.ఆర్ కొమరం భీం గా.. రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 350 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు తీసిన సినిమా రష్ చాలా సాటిస్ఫైడ్ గా ఉందని తెలుస్తుంది. బాహుబలి తర్వాత మళ్లీ రాజమౌళి దాన్ని మించే సినిమా చేస్తున్నాడని మాత్రం అర్ధమవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: