రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  బల్గెరియాలో షూటింగ్ జరుగుతున్నది. కొమరం భీం పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  


ఇదిలా ఉంటె, ఇందులో రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  గతంలోనే అలియా భట్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది.  ఈలోగా అలియాకు కడుపు నొప్పి కారణంగా అమెరికా వెళ్ళింది.  ఇదిలా ఉంటె, వచ్చే ఆర్ఆర్ఆర్ యూనిట్ బల్గెరియా నుంచి ఇండియా వస్తుంది.  ఇండియా వచ్చిన తరువాత, అలియా భట్ షూటింగ్ లో పాల్గొంటుంది.  


ఆమె పాత్ర గురించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.  అల్లూరి సీతారామ రాజు సినిమాలో రామరాజుగా చరణ్ నటిస్తుంటే ఆయన భార్య సీతగా అలియా భట్ నటిస్తున్నది.  ఇందులో సీత పాత్ర గెస్ట్ రోల్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉన్నది.  అయితే, తనది అతిధి పాత్ర అయినా సరే తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలి అన్నది తన డ్రీమ్ అని అంటోంది.  


తనకు జీవితంలో రెండు డ్రీమ్స్ ఉన్నాయని అందులో ఒకటి సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో సినిమా కాగా రెండోది రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడం.. ఈ రెండు వచ్చే ఏడాది నిజం కాబోతున్నాయి.  ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుండటం విశేషం.  సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఇన్షాఅల్లా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నది అలియా. అలియాలా కష్టపడితే డ్రీమ్ ను నెరవేర్చుకోవచ్చు.  అంతేకదా మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: