సహజత్వమే నాకు చాలా ఇష్టం -  జరీన్ ఖాన్

వీర సినిమా ద్వారా బాలీవుడ్  కి పరిచయమైన జరీన్ ఖాన్ నెటిజన్ల ట్రోలింగ్  కు గురయింది.   తాను బరువు తగ్గి  ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు  చూసి నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

 

ఈ మధ్యనే బరువు తగ్గిన బొద్దుగుమ్మ  రాజస్థాన్ లోని తన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.    దానిని చూసిన నెటిజన్లు, అంతలా లావెక్కడం ఎందుకు, పొట్ట మీద కుట్లు ఏమిటని  విపరీతంగా ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనిపై స్పందిస్తూ జరీన్ ఖాన్ చాలా సౌమ్యంగా నే  చురకలు అంటించింది. సహజత్వం తన ప్రాణం అని, తన రూపాన్ని దాచుకోవలసిన అవసరం లేదని, 50 కిలోల బరువు తగ్గిన తన శరీరం ఇలానే ఉంటుందని,  దీనికొరకు ఫోటోషాప్ ఏమి ఉపయోగించే లేదని తెలియజేసింది.


తన గురించి ఆరా తీస్తున్న వారందరికీ  ధన్యవాదాలు తెలుపుతూ బాడీ షేవింగ్ మానుకోవాలని జరీన్ ఖాన్ నెటిజన్ల అందరికీ హితవు పలికింది.


ఈమధ్య దక్షిణాది సినిమాల్లో కూడా మెరుస్తున్న ఈ బాలీవుడ్ భామ తెలుగులో కూడా గోపీచంద్ తో ఒక సినిమా  లో జతకట్టనున్న టు సమాచారం


జరీన్ ఖాన్ కు బాలీవుడ్ నుంచి భారీ మద్దతు లభించింది.   అనుష్క శర్మ ట్వీట్ చేస్తూ “జరీన్ నువ్వు చాలా అందంగా ఉంటావు,  అలాగే బరువు తగ్గడంలో నువ్వు అందరికీ ఆదర్శం అని చేసింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: