ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అంతా తాము నటించే సినిమాలకు సంబంధించి నిర్మాతల దగ్గర నుండి పారితోషికం తీసుకోకుండా భాగస్వామిగా ఉంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న మహేష్ బాబు హీరోగా తనకు రావలసిన రెమ్యూనిరేషన్ కు బదులు నాన్ థియేటర్ హక్కులు తీసుకున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చినా ఈ నాన్ ధియేటర్ హక్కుల వల్ల మహేష్ కు 53 కోట్ల వరకు ఆదాయం వస్తోంది అన్న వార్తలు సంచలనంగా మారాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించి కేవలం శాటిలైట్ హక్కుల మూలంగానే 17 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదికాక ఈసినిమాకు సంబంధించి డిజిటల్ హిందీ డబ్బింగ్ అడియో రైట్స్ ద్వారా వచ్చే వివిధల ఆదాయాలను లెక్కలోకి తీసుకుంటే మహేష్ కు 53 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు.

మహేష్ ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించినా ఇంత భారీ స్థాయిలో మహేష్ కు ఒక సినిమాకు సంబంధించి పారితోషికం రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రేజీ రేట్స్ ఈమూవీకి రావడానికి గల కారణం మహేష్ అనీల్ రావిపూడిల కాంబినేషన్ తో పాటు రష్మిక విజయశాంతిలు ఈ మూవీలో నటించడం అని అంటున్నారు. 

మహేష్ తన కెరియర్ లో ఎప్పుడూ ఆర్మీ ఆఫీసర్ గా నటించని పరిస్థితులలో ఈ మూవీలో మహేష్ లుక్ ఈ మూవీకి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోంది. దీనికితోడు ఈ మూవీలో కీలకంగా వచ్చే సన్నీ వేషాలలో విజయశాంతి మహేష్ ల పోటాపోటీ నటన ఈ మూవీకి హైలెట్ అని అంటున్నారు. ఈ మూవీకి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లను దాటిపోయే పరిస్థితులలో ఈ మూవీ బయ్యర్లకు లాభాలు రావాలి అంటే ఈ మూవీకి కూడ ఖచ్చితంగా 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావాలి అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: