టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీల అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఒకటీ రెండు సినిమాలకే ఈ అందాలు పరిమితమైనా కెరీర్ ఇక్కడ నుంచి ప్రారంభించాలని తెగ ఉత్సాహపడుతుంటారు. ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ భామలు తెలుగు తెరపై తమ అందాల ఆరబోతతో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టారు. ముంబైలో ఉండే ఈ కెరీర్ మోడల్స్ ని దగ్గరుండి మరీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిస్తూ ఉంటారు. అయితే వారికి అవకాశాలు దక్కుతాయి కానీ.. లాంగ్ టైమ్ కాదు, ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు.
ఇక ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు కైపెక్కించే నృత్యాలతో తెగ హల్ చల్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పంజాబీ కుడీ అయిన ఈ రుహాని సుశాంత్ 'చిలసౌ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటన విషయంలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగు లో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ కాస్త డోస్ ఎక్కువ పెంచేసింది.
ఈ హాట్ బ్యూటీ ఎలాగూ సోషల్ మీడియాలో యాక్టివ్ కాబట్టి అక్కడ తన ప్రతాపం చూపిస్తోంది. ఆ మద్య ఉల్లిపొరలాంటి డ్రెస్ తో క్లీవేజ్ అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. గ్లామర్ డోస్ ఎక్కువైనా పర్వాలేదు.. అలాంటి సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పే విధంగా ఆ ఫోటో తో సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా మరో ఫోటో పోస్ట్ చేసింది. ఫోటో విషయానికి వస్తే షర్టు.. ప్యాంట్ ధరించింది. షర్టుకు బటన్లు పెట్టుకోకుండా సోకులను ఆరేసింది. తలకు కొప్పు కట్టి.. డీసెంట్ మేకప్ తో లిప్ స్టిక్ తో స్టైలిష్ గానే ఉంది. రుహాని హాటుగానే ఉంది కానీ ఫోటోలో ఒక డిఫెక్ట్ ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ ఫోటో చూశాకైనా మన దర్శక నిర్మాతలు రుహానికి గ్లామర్ రోల్స్ ఇస్తారో లేదో చూడాలి.