బిగ్ బాస్ 3 లో నలభై నాలుగు వ రోజు ఉదయం గబ్బర్ సింగ్ సినిమాలోని గన్నుల్లాంటి కన్నులున్న పిల్ల పాటతో అందరూ నిద్రలేచారు. శిల్పా చక్రవర్తి కూడా మిగతా సభ్యులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేసింది. బాబా మాస్టర్ శిల్పను పని చేయొచ్చు కదా అన్నాడు. దానికి ఆమె వాచ్ చేస్తున్న అంది. కెప్టెన్ వరుణ్ తో బాబా మాస్టర్ వారం రోజుల పాటు వాచ్ చేయొచ్చ తర్వాత ఎలాగూ ఉండదు కదా అన్నాడు. పొద్దు పొద్దునే ఇలాంటి మాటలు ఏంటి మాస్టర్ అని శిల్పా చక్రవర్తి అంది. ఈ విషయం గుర్తు పెట్టుకుంటానని నాకు నచ్చలేదు అని అంది. పునర్నవి వచ్చిన మొదటి రోజు ఇరగదీసిందని బాబా శిల్పతో అన్నాడు. మళ్లీ శిల్పతో నువ్వు రెండు వారాలు వుంటావని చెప్పాడు.
శ్రీముఖి నామీద మళ్లీ అలిగిందని రాహుల్ పునర్నవితో చెప్పాడు. మాటిమాటికీ గొడవ పెట్టుకుంటోందని అన్నాడు. ఎందుకు అలిగావని డైరెక్ట్ గా వెళ్లి శ్రీముఖిని అడుగు అని పునర్నవి చెప్పింది. ఇంతలో ఒక మ్యూజిక్ రావడంతో ఇంటి సభ్యులంతా ఏం జరుగుతుందోననే చూశారు. ముసుగు వేసుకున్న కొందరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి చేతికి దొరికిన వస్తువులన్నీ దోచుకెళ్లిపోయారు. సభ్యులంతా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికీ కొన్ని వస్తువులను ఇంటి సభ్యులు దొంగల నుంచి లాక్కొని దాచిపెట్టారు. తరవాత శ్రీముఖి వచ్చి బాబాతో మీరు ఏం కాపాడారని అడిగింది. దొండకాయ ప్రై అని చెప్పాడు. ఇంతలో వితిక పప్పు ఏది అని అడిగింది. నా ముందు ఒకళ్ళు పప్పు తీసుకెళ్తుంటే ఎలా పట్టుకోవాలి పాపం అని బాబా మాస్టర్ అన్నాడు.
వాళ్లు ఏం చేస్తారా అని ఇంట్రెస్టింగ్ గా చూశానని చెప్పాడు. మీరు వ్యూవర్ ఆ లేక కంటెస్టెంట్ ఆ అని శ్రీముఖి సీరియస్ అయింది. శిల్ప గారు ఆమె సామాన్లను తీసుకెళ్తుంటే చెయ్యి కొరికి మరీ తెచ్చుకుందని చెప్పింది. అయ్యో అయితే వాళ్లు ఇంజెక్షన్ చేసుకోవాలా అని బాబా అన్నాడు. బాబా మాస్టర్ మీరేమైనా జాతకాలు చెబుతున్నారా అని శిల్పా అడిగింది. మీరు అలా మాట్లాడటం వల్ల ఎదుటి వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుందని ఎప్పుడైనా ఆలోచించారా అంది. తర్వాత కిచెన్ లో బాబా మాస్టర్ దొంగలతో కుమ్మక్కై మమ్మల్ని మోసం చేశాడంటూ శ్రీముఖి పాట పాడింది. దొంగలు దోచిన నగరమనే వీక్లీ టాస్క్ ని బిగ్ బాస్ సభ్యులకు ఇచ్చాడు.
ఇంతలో దోపిడీకి గురైన ఒక నగరం ఉందని దోపిడికి గురైన వస్తువులన్నీ దొంగల ఆధీనంలోనే ఉన్నాయని ఈ దొంగల అందరికీ ఒక రాణి ఉందని ఆమె కనుసన్నల్లోనే ఈ నగరం నడుస్తోందని బిగ్ బాస్ చెప్పాడు. దొంగలంతా అప్పుడప్పుడు ఇంటిని దోచి అందరినీ ఇబ్బంది పెడతారని అన్నాడు. ఇంటి నుంచి దోచుకున్న ప్రతీ వస్తువు గార్డెన్ ఏరియాలోని దొంగల అడ్డాలో వారి కాపు కాస్తున్న వారి మధ్య ఉంటుందని వారి వస్తువుల కోసం నగర వాసులు దొంగలతో ఎదురుతిరగాలని లేకుంటే వారికి ఆహారం లబించదని బిగ్ బాస్ అన్నాడు. దొంగలకు రాణిగా శిల్ప, దొంగలగా రవి, రాహుల్, వరుణ్, జ్యోతి, పునర్నవి నగర వాసులుగా అలీ, శ్రీముఖి, వితిక, బాబా మాస్టర్, హిమజ, మహేష్ ఉంటారని చెప్పాడు.
రాణి డెన్ లోని వస్తువులను కాపాడుకోవడం దొంగల కర్తవ్యం. దొంగల రాణిని గద్దె దించి నగరాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడం నగర వాసుల కర్తవ్యం అని బిగ్ బాస్ అన్నాడు. రాణిని గద్దె దించడానికి గార్డెన్ ఏరియాలోని రాణి పోస్టర్ లకు నలుపు రంగు వేయాలని రాణికి సంబంధించిన జెండాలన్నింటినీ తీసేయాల్సి వుంటుంది అని రాణి గన్ ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పాడు. స్విమ్మింగ్ పూల్ లోని రాణి నిధిని దొంగిలించవలసి వుంటోందని చెప్పాడు. రెండు టీమ్ లో సభ్యులు ఎలా ఆడాలో చర్చించుకున్నారు. బిగ్ బాస్ పంపిన దుస్తుల్ని వేసుకున్నారు. శ్రీముఖి ముందే గార్డెన్ ఏరియాలోకి వచ్చి అక్కడ వున్న జండాలు ఫొటోలనూ లెక్కపెట్టింది. బజర్ మోగగానే కొన్ని జండాలను పీకేశారు. బాబా మాస్టర్ ఫోటోలకు బ్లాక్ స్ప్రే కొడుతుండగా దొంగలు లాక్కున్నారు.
వితికా జెండాలన్నీ తీసుకెళ్లి ఇంట్లో దాచేస్తుంది. ఇంటి సభ్యులందరినీ లివింగ్ రూమ్ లో కూర్చోవాలని బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ ఇంట్లో ఎలాంటి హింస జరగకూడదని ఎవరికీ గాయాలు కాకుండా తెలివితో టాస్క్ ను పూర్తి చేయాలని అన్నాడు. తరవాత మహేష్, అలీ,బాబా మాస్టర్, శిల్ప దగ్గరికెళ్లి మేడం ఆ గన్ ఇస్తే పోతామంటూ బతిమిలాడారు. ఇది నా అడ్డా నేను ఊ అంటే కాల్చిపారేస్తారని శిల్ప చెప్పింది. రాణి బొట్టు చెరిగిపోయింది. మేకప్ వాళ్లనీ పిలవండి రా అంటూ బాబా మాస్టర్ ఏడ్చాడు. జెండా లాక్కునే విషయంలో రాహుల్ ని శ్రీముఖి తిట్టింది. ఎందుకు ఓవర్ గా చేస్తున్నావు అంది. నన్ను కూడా ముట్టుకున్నాడు కదా ఎందుకు రైజ్ అవుతున్నావని శ్రీముఖితో పునర్నవి వాదించింది.
మహేష్, వితిక స్విమ్మింగ్ పూల్ లోకి దూకి నిధిని తీసుకునేందుకు యత్నించడంతో రవి వచ్చి అడ్డుకున్నాడు. అలీ కూడా దూకేశాడు. అతనిని ఆపడానికి రాహుల్ దూకాడు.వితిక రవిని నీళ్ళలో ముంచుతోందని జ్యోతి అంది. అంతకుముందు రవి ఏం చేశాడో తెలుసా కెమెరా ఉంది కదా తరవాత తెలుస్తుందనీ వితిక సీరియస్ అయ్యింది. టాస్ కు వస్తే దెయ్యంలా బిహేవ్ చేస్తున్నారని అంది. రాణిని కుర్చీ లోంచి కిందకి దించి గన్ ను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఒక్కొక్కరు ఒక్కో దొంగను గట్టిగా పట్టుకున్నారు. రాహుల్ కి దెబ్బ తగిలింది. వితిక లోపలకు వెళ్లి మెడిసిన్ తెస్తానంటూ గన్ తీసుకుంది. వితిక దగ్గర నుంచి బలవంతంగా వరుణ్ గన్ ని లాక్కున్నాడు. జోక్ చేస్తున్నావా అంటూ మండిపడ్డాడు.