యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇటీవల శుక్రవారం విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి షోకే ఫ్లాఫ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దాదాపు పదివేల స్క్రీన్స్ లో సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా కానీ బాలీవుడ్ సైడ్ కలెక్షన్లు అద్భుతంగా రాబడుతోంది. ఇటువంటి నేపథ్యంలో సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాధపడుతున్న ప్రభాస్ అభిమానులకు ఓ తమిళ డైరెక్టర్ సినిమా పై చేసిన కామెంట్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. విషయంలోకి వెళితే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభు సోషల్ మీడియా వేదికగా సాహో సినిమా పై సెటైర్లు వేశాడు.


ఎలా అంటే 'సాహో' సినిమా పెద్ద సినిమా కాబట్టి చాలా సినిమాల్లో అప్పట్లో విడుదలవ్వాల్సినవి వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ అదే టైమ్ లో తమిళ నటుడు వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన 'సిక్సర్' అనే చిత్రాన్ని సాహోకి పాటే ఆగష్టు 30న రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కానీ సాహోకి మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. వెంకట్ ప్రభుకి, వైభవ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది.


అతడిని పొగిడే క్రమంలో సాహోపై వెంకట్ ప్రభు సెటైర్స్ వేశాడు. 'రివ్యూలన్నీ చూస్తుంటే ఈ వీకెండ్ 'సిక్సర్' దే అని పిస్తోంది. నా 'సాహో'దరుడు(సహోదరుడు) వెంకట్ కు శుభాకాంక్షలు అని వెంకట్ ట్వీట్ చేశారు.  దీంతో వెంకట్ ప్రభు చేసిన సోషల్ మీడియా లో కామెంట్ కి రెచ్చిపోయారు ప్రభాస్ అభిమానులు. ఇటువంటి క్రమంలో గతంలో వెంకట్ ప్రభు నీ ప్రభాస్ పొగిడిన వీడియో ని పోస్ట్ చేసి వెంకట్ ప్రభు అవకాశవాది అని బయట ప్రపంచానికి తెలిసొచ్చేలా గట్టిగా ప్రభాస్ అభిమానులు బుద్ధి చెప్పారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: