టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన మహర్షితో సూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతకముందు భరత్ అనే నేను తో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్, ఆ తరువాత మహర్షి తో హిట్ కొట్టి, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ విజయాలు దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇక మహేష్ బాబు సినిమాలతో పాటు మన దేశంలోని పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మొదట థమ్స్అప్ యాడ్ తో తన బ్రాండ్ ఇమేజిని మొదలెట్టిన సూపర్ స్టార్, ఆ తరువాత అతి పెద్ద బట్టల బ్రాండ్ ప్రోవోగ్, అలానే సంతూర్, యప్ టివి, లాయిడ్ మరియు కొన్ని ఇతర దాదాపు 12 బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా సంతూర్ బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ వ్యవహరిస్తుండడంతో, ఆ సోప్ క్రేజ్ మరియు సేల్స్ ఇటీవల కొంత పెరిగినట్లు సమాచారం. అందుకే అప్పటినుండి సంతూర్ వారు ఆయన్నే తమ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నారు. ఇకపోతే నిన్న మహేష్ బాబు నటించిన సరికొత్త సంతూర్ యాడ్, యూట్యూబ్ లో రిలీజ్ అయి, మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. 

మహేష్ బాబు తన అసిస్టెంట్ తో కలిసి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుండగా, ప్లేయర్ కొట్టిన బాల్ ఒక్కసారిగా బౌండరీ లైన్ దాటి ప్రేక్షకుల కుర్చీల వద్ద పడడం, మహేష్ ఎగిరి దానిని అందుకోబోతే, వెనుక ఇంకొక అమ్మాయి దాన్ని పట్టుకోవడం, అది చూసి అమ్మాయి బాగుందని, తమ సినిమాలో తీసుకోవాలని భావించి మహేష్ ఆమె వద్దకు వెళ్లడం, అయితే సడన్ గా మమ్మి అంటూ ఒక చిన్న పాప ఆ అమ్మాయి వద్దకు రావడం వంటివి ఈ యాడ్ లో చూడవచ్చు. ఇక ఎప్పటివలె ఈ యాడ్ లో సూపర్ స్టార్ అదిరిపోయే డ్రెస్ మరియు స్టైలింగ్ తో ఫ్యాన్స్ ను అలానే యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. కాగా ఈ యాడ్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: