ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్లలో సిమ్రాన్ కూడా ఒకరు.  అప్పటి టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.  టాప్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.  ఇప్పుడు ఈ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది.  రజినీకాంత్ పేట సినిమాలో హీరోయిన్ గా చేసింది.  పెద్ద వయసులో ఉన్న రజినీకాంత్ తో ప్రేమలో పడుతుంది.  


ఆమె ఓ ప్రకృతి వైద్య నిపుణురాలు.  ఆమె వైద్యం కోసం ఇంటికి వచ్చిన రజినీకాంత్.. ఆమెతో ప్రేమలో ఎలా పడతాడో సినిమాలో అద్భుతంగా చూపించారు.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  అంచనాలకు తగ్గట్టుగా సినిమా హిట్టైంది.  సాంగ్స్ విషయంలో కూడా సినిమా హైలైట్ అని చెప్పొచ్చు.  ఇక ఇందులో రజినీకాంత్ తో సిమ్రాన్ ప్రేమలో పడే సన్నివేశం ఒకటి ఉంది.  అందులో రజినీకాంత్ చేసిన యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పాలి.  


రజినీకాంత్ సిమ్రాన్ ఇంటికి వస్తాడు. సిమ్రాన్ ఇంటికి వచ్చిన రజినీకాంత్ ఆమె కోసం కాఫీ తయారుచేసి ఇస్తాడు.  కాఫీ తాగుతూ సిమ్రాన్ ఇచ్చిన హావభావాలతో రజినీకాంత్ ఫ్లాటైపోతాడు.  ఆ సమయంలో రజినీకాంత్ హావభావాలు కూడా సూపర్ గా ఉంటాయి.  ఇద్దరి మధ్య కాఫీతో రొమాంటిక్ లవ్ స్టార్ట్ అవుతుంది.  అలా ఇద్దరి మధ్య పుట్టిన ఆ ప్రేమ.. అద్భుతం అని చెప్పాలి.  లేటు వయసులో ఘాటు ప్రేమ అంటే ఇదే.  


సిమ్రాన్ టాప్ హీరోయిన్ ఎందుకు అయ్యింది అని చెప్పడానికి ఆ ఒక్క సన్నివేశం చాలు. రీ ఎంట్రీ తరువాత కూడా అదే స్థాయిలో నటించడం విశేషం.  సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది.  రజినీకాంత్ కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు.  అప్పటి వరకు ఫైట్స్ పై పెద్దగా దృష్టిపెట్టని రజినీకాంత్, పేట సినిమాలో తిరిగి మాస్ కు నచ్చే విధంగా సినిమాలో నటించి మెప్పించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: