నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమవ్వనుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సన్నివేశాల్లో బాలయ్య - భూమిక చావ్లా మధ్య వచ్చే సీన్స్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ ను ఉంటాయట. పైగా ఈ సీన్స్ లో జయసుధ, రావు రమేష్ కూడా ఉన్నారని.. వారు కూడా షూట్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ చిత్రబృందం విడుదల చేసిన రెండు పోస్టర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ గురించి 'రాయల్ సింహా' అని పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దర్శకనిర్మాతలు కూడా ఈ సినిమాకి ఇదే టైటిల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ అండ్ భూమిక చావ్లా హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే భూమిక చావ్లా మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.
అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. బ్లాక్బస్టర్ `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. `జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది. అలాగే ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మరి ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.