తెలుగు సినీ దర్శకులు ఎప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూ వస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే. అయితే, బాలీవుడ్ బ్యూటీస్ తొలుత తెలుగులో ఎంట్రీ   ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అనుకున్న ఫెమ్ రాకపోతే మళ్ళీ మూట ముల్లె సర్దుకొని బాలీవుడ్ కు పయనమయిన బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. వారు ఏ సినిమాలో నటించారో  ఇప్పుడు చూద్దాము..
 
రవీనా తండనా:

రవీనా ఈ  పేరు పెద్దగా ఎవరికీ తెలిసుండక పోవచ్చు .. ఈమె విక్టరీ నటించిన శీను సినిమాలో హీరోయిన్ ఈమె.. వెంకీ సరసన నటించిన ఆమెకు ఈ సినిమాకు అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో.. అదే మొదటి సినిమా, అదే చివరికి సినిమా అయింది.. దానితో ఆమె మళ్ళీ బాలీవుడ్ కు పయనమైంది..

ప్రియాంక చోప్రా:

మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన తుపాకీ  చిత్రంలో నటించింది ఇక ఆ సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఆమె మల్లి బాలీవుడ్ కు వెళ్ళింది .

బిపాసా బసు:

మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాతో ప్రేక్షకులకు ఈ పేరు పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవ్వకపోగా మహేష్ కి తగ్గట్లే ఆ సినిమా లేదని మాటలను మూటకట్టుకుంది.. దానితో ఆమె ఇక్కడ సినిమా చేయలేనని ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే తిరుగు పయనమైంది..

ముంతాజ్:

విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా జెమినీ సినిమాలో హాట్ బ్యూటీగా కామిని పట్టుకోవడం నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తరవాత చాలా కాలం వరకు తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. మొన్న ఆ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలలో ఐటమ్  పాటలో మెరిసింది.. తరవాత ఎక్కడ కనపడలేదు.

లిసా రేయ్:

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాతో మెరిసిన ఈ బ్యూటీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.. అడపాదపా సినిమాలలో మెరిసింది..

సారహ్ జానీ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో పవన్ మనసు దోచుకున్న ఈ బ్యూటీ సారహ్.. సినిమా పవన్ కు సెట్ అవ్వలేదు.. డైరెక్టర్ పవన్ లోని మరో కోణాన్ని సరిగ్గా  చూపించలేకపోవడంతో ఆ సినిమా బాక్సాఫీస్  వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.. ఇంక చేసేదేమి లేక బాలీవుడ్ కు చెక్కేసింది.. 
చూసారుగా తెలుగులో ఒకప్పుడు తళుక్కుమన్న  హిందీ తారలు వీరే..


మరింత సమాచారం తెలుసుకోండి: