ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది.  సినిమా రిలీజ్ కు ముందు పాజిటివ్ టాక్ రావడంతో భారీ హిట్ అవుతుందని అనుకున్నారు.  తీరా రిలీజ్ అయ్యాక చూస్తే.. దారుణంగా మారిపోయింది.  సీన్ రివర్స్ కావడంతో  సాహో కల్లెక్షన్లపై దాని ప్రభావం పడింది.  వరసగా నాలుగు రోజులు సెలవుపై కావడం సినిమాకు కలిసి వచ్చిన అంశం. ఐదో రోజు మంగళవారం రోజునకలెక్షన్లు పర్వాలేదనిపించాయి.  


మొత్తంగా ఈ సినిమా దాదాపుగా 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఇది గ్రాస్ మాత్రమే.  డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ కావాలి అంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి.  ఆ ప్రయాణం వీలవుతుందా అన్నది చూడాలి.  ఎంతవరకు సాహో వసూలు చేయగలదు అన్నది ఇప్పుడు చూడాల్సిన అంశం.  సినిమాపై నమ్మకం పెట్టుకుంటే ఫెయిల్ కావడంతో.. దర్శకుడు సుజిత్ రంగంలోకి దిగాడు.  


మొదటినుంచి ఈ సినిమా ఫ్యాన్స్ కు నచ్చుతుందని అంటున్నాడు. డైహార్డ్ ఫ్యాన్స్ అనే ట్యాగ్ ఇచ్చాడు.  ఈ సినిమా ఇప్పుడు సేవ్ కావాలి అంటే అది ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ చేతుల్లోనే ఉన్నది.  వాళ్లంతా మరలా ఓసారి సినిమా చూస్తేనే ఈ సినిమా సేఫ్ అవుతుంది.  ఇప్పటికే ఫ్యాన్స్ ఒకసారి చూశారు.  ఇప్పుడు మరలా రెండోసారి చూడాలి అంటే మాములు విషయం కాదు.  


ఒకసారి చూడటానికే జేబులు చిల్లులు పెట్టుకున్నారు.  ఒక్కో టికెట్ ఖరీదు దాదాపుగా 500 నుంచి 1000 రూపాయల వరకు పలికింది.  ఈ మొత్తంలో సినిమాకు ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు.  అలాంటి ఇప్పుడు, రెండోసారి చూడాలి అంటే.. మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఆ స్థాయిలో ఖర్చు చేయడం ఇప్పుడు సాధ్యం అయ్యే పని కాదు.  ఈ విషయం దర్శకుడు సుజిత్ కూడా తెలుసు.  కానీ, సుజిత్ మాత్రం ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి రెండోసారి సినిమా చూడమని చెప్తే ఎలా చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: