నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఆకట్టుకునే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తెరకెక్కించే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి ప్రియా అరుళ్ మోహన్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా అధికారిక ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, సూపర్ రెస్పాన్స్ ని సంపాదించింది. 

అలానే ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని మూడు లిరికల్ సాంగ్స్ లో రెండు సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచి శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నాలుగవ సాంగ్ ని రేపు సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ మాములు సాంగ్ కాదు, సినిమా ప్రమోషన్ కోసం హీరో నాని, సంగీత దర్శకుడు అనిరుద్ లపై ప్రత్యేకంగా తెరకెక్కిన ఈ సాంగ్, మంచి ట్రెండీ స్టయిల్లో సాగనున్నట్లు సమాచారం. నిజానికి ఈ విధమైన ప్రమోషనల్ సాంగ్స్ ఇదివరకు మన తెలుగు సినిమాల్లో చాలా తక్కువ సినిమాల్లో దర్శనమిచ్చాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ తరహా ప్రమోషనల్ సాంగ్స్ ని అక్కడి హీరోలు, సంగీత దర్శకులు వినియోగిస్తుంటారు. 

ఇక ఈ సాంగ్ లో నాని, అనిరుద్ అదరగొట్టే స్టెప్స్ తో ఆడియన్స్ ని అలరించనున్నట్లు సమాచారం. ఈ సాంగ్ రేపు యూట్యూబ్ లో రిలీజ్ అయిన తరువాత, ఇది తమ సినిమా ప్రమోషన్ కు ఎంతో బాగా ఉపయోగపడుతుందని సినిమా యూనిట్ భావిస్తోందట. సీనియర్ నటి లక్ష్మి, ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ కార్తికేయ, శరణ్య మోహన్,  ప్రియదర్శి, రఘుబాబు తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఫోటోగ్రఫీని పిసి శ్రీరామ్, ఎడిటింగ్ ని నవీన్ నూలి అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాని ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: