బిగ్ బాస్ తెలుగు సీజన్ 3  బుల్లితెరపై కనులవిందు చేస్తూ అందరి మనసులని దోచుకుంటూ బుల్లితెరపై టాప్ రియాలిటీ షో గా ముందుకుపోతుంది. ఇప్పటికే హౌస్లో నుండి ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకి వెళ్లిపోయారు. ఇక ఈ వారం ఐదుగురు హౌస్ మేట్స్  నామినేషన్స్ లో  లో ఉన్నారు. ఇకపోతే ఈ వారం టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి దొంగలు దోచిన నగరం అనే టాస్క్ ఇచ్చాడు.  దొంగలు దోచిన నగరం రెండో దశకు చేరుకుంది. అంటే నిన్నటి రచ్చ రెట్టింపు అన్నమాట. దీనిలో భాగంగా దొంగల ముఠాకు నాయకురాలుగా ఉన్న శిల్పాను నగరవాసులు గద్దె దింపాలి. అలాగే  ఆమె చేతిలో ఉన్న గన్‌ను తీసుకుని ఆమెను జైలులో బంధించాలి.  

ఇక ఈ టాస్క్ లో  ఎలాగైనా గెలిచేందుకు శిల్ప.. రవితో కలిసి విశ్వప్రయత్నం చేసింది. తన దగ్గర ఉన్న గన్‌ను లాక్కుని పోకుండా ఒంటికి గట్టిగా కట్టించుకుంది శిల్ప. దాన్ని లాక్కునే ప్రయత్నంలో భాగంతో అలీ రజా బలప్రదర్శ చేశాడు. అడ్డొచ్చిన వాళ్లను తిప్పి అవతల పడేశాడు. మొత్తంగా దొంగలముఠాకి నాయకురాలుగా ఉన్న శిల్పతో బంతి ఆడేశారు నగరవాసులుగా ఉన్న అలీ, హిమజ, శ్రీముఖి, బాబా భాస్కర్‌లు. అయితే తీవ్రంగా ప్రతిఘటించిన శిల్పా చక్రవర్తి తనను తాను కాపాడుకోవడం కోసం వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేసింది. అయితే స్విమ్మింగ్ ఫూల్‌‌లో నుండి ఆమెను తీసుకువచ్చి జైలులో వేసేందుకు నగరవాసులుగా ఉన్న అలీ, బాబా భాస్కర్, మహేష్‌లు స్విమ్మింగ్ పూల్‌లో దూకి మరీ శిల్పా చక్రవర్తిని లాగిపడేసాడు.

రవి ఆమెను కాపాడటం కోసం వెనకనుండి గట్టిగా పట్టుకుంటే.. అలీ ఆమెను లాగే ప్రయత్నంలో వీర కుమ్మడు కమ్మేశాడు. ఇక ఈ టాస్క్ ఆడుతున్న సమయంలో  అలీ, వరుణ్, రవి, బాబా భాస్కర్, రాహుల్‌లు కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. రాహుల్, అలీలు అయితే కంట్రోల్ తప్పి కొట్టుకున్నారు. తన్నుకున్నారు. అయితే మరికాసేపు ఆగితే  పరిస్థితి చేజారిపోతుంది అని భావించిన బిగ్ బాస్ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ టాస్క్ లో హింస ఎక్కువ కావడం తో టాస్క్ ని తక్షణమే రద్దు చేస్తునట్టు తెలిపాడు.

అంతేకాదు ఈ గేమ్ రద్దు కావడానికి గల వారిపై కఠిన చర్యలు తీసుకుంటా. మీలో ఎవరు ఎక్కువ హింసకు పాల్పడ్డారో వెంటనే చెప్పాలని బిగ్ బాస్ కోరడంతో కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో రవి, రాహుల్ పేర్లను చెప్పారు. దీంతో వారిని జైలుకు పంపారు బిగ్ బాస్. అంతే కాకుండా వాళ్లకు కఠిన శిక్షలు అమలు చేశారు. వాళ్లకు ఫుడ్ అందించకూడదని కంటెస్టెంట్స్ ఆదేశాలు ఇచ్చారు. వారికి ఆహారంగా బిగ్ బాస్.. రాగి సంగటి, ఆపిల్ మాత్రమే జైలు ఫుడ్‌గా ఇచ్చారు. జావలో కనీసం ఉప్పుకూడా లేకుండా ఇచ్చారు. వాళ్లు జైలుకు వెళ్లడానికి కారణమైనందుకు అలీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఏడ్వడం ఏంటిరా అంటూ అతన్ని తెగ ఓదార్చారు హౌస్‌లో ఉన్న మహిళామణులు. ఇక జైలు ఫుడ్ తినడానికి చాలా ఇబ్బందులు పడ్డారు రాహుల్, రవి. ఉప్పులేకుండా జావ ఎలా తాగాలి. కనీసం ఉప్పు అయినా ఉంటే బాగుండు.. అని ఇది ఇలా తాగుతుంటే జీవితంలో చేయలేని తప్పు చేస్తున్నట్టు ఉందని అన్నారు రవి. ఇక బిగ్ బాస్‌లో భార్యా భర్తలుగా ఉన్న రొమాంటిక్ జోడీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. తనతో టైం స్పెండ్ చేయడం లేదని వితికా కన్నీళ్లు పెట్టుకోగా.. 24 గంటలు నీతోనే ఉంటున్నా.. ఇంకా టైం కేటాయించు టైం కేటాయించు అంటే ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకు. మనం గేమ్ ఆడటానికి వచ్చాము. హనీమూన్‌కి కాదు.. కాస్త కామన్‌సెన్స్‌తో ఆలోచించి అంటూ క్లాస్ పీకారు వరుణ్.  


మరింత సమాచారం తెలుసుకోండి: