పవన్ కళ్యాణ్  కేవలం రాజకీయాలను మాత్రమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వ్యహారాలను చక్కబెట్టె గాడ్ ఫాదర్ స్థాయికి ఎదిగిపోయాడా అన్న విషయానికి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన లేటెస్ట్ గా జరిగింది. సినీ కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చే చిత్రపురి కాలనీ పై ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టాడు. 

చిత్రపురి కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మొన్న హైదరాబాద్' లోని ‘జనసేన’ కార్యాలయంలో తనను కలిసిన జూనియర్ ఆర్టిస్టులు క్యాస్టూమర్లు  ఫైటర్లతో పవన్ కల్యాణ్ పలు సమస్యలపై చర్చించాడు. ఈసందర్బంగా వారి సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో పవన్ ఇక రానున్న రోజులలో ఫిలిం ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా మారబోతున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

సినిమా ఇండస్ట్రీలో 24 విభాగాలకు చెందిన తమకు ఇళ్లు దక్కడం లేదు చిత్ర పరిశ్రమకు సంబంధంలేని వాళ్లకి ఫ్లాట్స్ దక్కుతున్నాయి అన్న విషయాన్ని చాలామంది పవన్ పవన్ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే ఇండస్ట్రీలో పని లేకుండా చేస్తాం అంటూ బెదిరిస్తున్న విషయాలను పవన్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వారందరి కోసం తాను ఉన్నాను అంటూ పవన్ హామీ ఇచ్చినట్లు టాక్. 

ప్రస్థుతం పవన్ చిత్రపురి కాలనీ సమస్యల పై దృష్టి పెట్టడంతో పవన్ రాజకీయాలలో కొనసాగుతున్నా ఫిలిం ఇండస్ట్రీ పై తన పట్టును కొనసాగించడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నట్లు అర్ధం అవుతోంది. గతంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏసమస్య వచ్చినా దాసరి జీవించి ఉన్న రోజులలో ఆయన దృష్టికి తీసుకు వెళ్ళేవారు. ప్రస్తుతం దాసరి లేని లోటును తీర్చడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడా అని అనిపిస్తోంది. ఒకవైపు సినిమాలు చేసే ఆలోచన కొనసాగిస్తూనే మరొకవైపు ఇండస్ట్రీలో తన పట్టును కొనసాగించు కోవడానికి చాలతెలివిగా వ్యూహాలకు పదును పెడుతున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: