టాలీవుడ్ అనే కాదు, ఇప్పటి వరకూ సౌత్ నుంచి ఎంతో మంది హీరోలు ఉత్తరాదిన సినిమాలు చేశారు. స్ట్రైట్ మూవీ చేశారు, డబ్బింగ్ మూవీస్  కూడా వెళ్లాయి. అప్పట్లో చిరంజీవి, నాగ్, వెంకీ కూడా ఒకటి రెండు హిందీ మూవీస్ తో బాలీవుడ్లో అడుగు పెట్టారు. దక్షిణాదిన రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు కూడా నార్త్ తో దమ్ము చూపించారు. అయితే సౌత్ నార్త్ ల మధ్య మాత్రం ఆ విభజన అలాగే ఉండిపోయింది.


దాన్ని బద్దలు కొట్టిన వాడు ఒక్క ప్రభాస్ మాత్రమే అంటున్నారు సినీ పండితులు. ప్రభాస్ సాహో మూవీ రిజల్ట్ తేడాగా ఉన్నా కూడా  ఉత్తరాదిన ప్రభాస్ పై ఉన్న మోజు అంతా ఇంతా కాదని వెల్లడైంది.  ప్రభాస్ సినిమా అంటే బీ టౌన్ వణికే రేంజిలో అక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక సినిమా బాగుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రభాస్ అంటే వెర్రెక్కిపోయే జనం మాత్రం నార్త్ లో ఉన్నారు.


ఇప్పటివరకూ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వంటి వాళ్ళ రాజ్యం నడిచింది.  సినిమా ఫట్ అయినా కూడా చూడాలి అన్న  క్రేజ్  కేవలం వాళ్ళకే సొంతం అయింది. సౌత్ ఉంచి హీరో మూవీ అంటే బాగుంటే చూడడం తప్ప వెర్రెత్తిపోవడం ఎక్కడా జరగలేదు. ప్రభాస్ విషయంలో మాత్రం అలా కాదు, హీరో మీద అభిమానం అలా పొంగిపొరలుతోంది. సినిమా  పోయినా సరే ఒక సారి చూడాలన్నది కేవలం సౌత్ హీరోల్లో ఒక్క ప్రభాస్ కే దక్కింది. నార్త్ హీరోలకే పరిమితమైన ఆ అపరిమితమైన  అభిమానాన్ని ఒక్క  ప్రభాస్ కొల్లగొట్టడం నిజంగా గ్రేట్.


ప్రభాస్ సాహో అంటూ నాసిరకమైన కధతో వచ్చాడు కానీ సరైన కధతో వస్తే మాత్రం విరగదీసే కలెక్షన్లతో సునామీ క్రియేట్ చేసేవాడని,  ఆయన సినిమా బీ టౌన్లో అదిరిపోయేదని కూడా ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.ఇప్పటికి కూడా సౌత్ కంటే నార్త్ లోనే సాహో కలెక్షన్లు అదిరిపోతున్నాయంటే సాహో కంటే  కూడా ప్రభాస్ ఇమేజ్ మాత్రమే మూవీని నిలబెట్టిందని అంటున్నారు.


సాహో తరువాత ఇక ప్రభాస్ వెనక్కి చూడకుండా డైరెక్ట్ గా హిందీ మూవీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇపుడు ప్రభాస్ ఆలిండీయా స్టార్ అని గట్టిగా ప్రూవ్ అయింది. ఏ సౌత్ హీరోకి దక్కని క్రేజ్ ప్రభాస్ సొంతమైన వేళ బీ టౌన్లో ప్రభాస్ రెచ్చిపోవడానికి రెడీగా ఉండాలి. ప్రభాస్ అభిమానులతో పాటు, సౌత్ సినీ జనమంతా అదే కోరుకుంటున్నారు. బీ టౌన్లో ప్రభాస్ వరస మూవీస్ తో వణుకు పుట్టడం ఖాయమని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: