‘ఓ బేబీ' మూవీతో ఎవరైనా సమంతతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను చేస్తే  ఆసినిమాకు ఇరవై కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ చేసే సత్తా ఉందని  తెలియడమే కాకుండా    మరో పది పదిహేను కోట్లు శాటిలైట్ రైట్స్ హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో నిర్మాతలకు మంచి ఆదాయం వస్తుంది అని లెక్కలు కడుతున్నారు. సమంత మార్కెట్‌ ముప్పయ్‌ అయిదు కోట్లు అని లెక్కలు వేసుకుని సమంతకి రెండు లేదంటే మూడు కోట్లు పారితోషికంగా ఇచ్చినా ఆ మూవీ ప్రాజెక్ట్ బాగా వర్క్ అవుట్ అవుతుంది అన్న అభిప్రాయం నిర్మాతలలో ఏర్పడింది. 

దీనితో సమంతతో సినిమా తీయగలిగితే ఇరవై కోట్ల లాభం చూడవచ్చు అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఏర్పడటంతో ప్రస్తుతం చాలమంది సమంతతో సినిమా తీద్దామని పలువురు నిర్మాతలు ఆమెని  సంప్రదిస్తూ ఆమె వద్ద క్యూ కడుతున్నారు. అయితే చాలామంది నిర్మాతలు సమంతను సంప్రదిస్తున్న ఆమె పెద్దగా ఆసక్తి కనపరచకుండా తనకు ‘ఓ బేబీ’ ‘సూపర్‌ డీలక్స్‌’ లాంటి కథలు కావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం. 

ఎవరు ఏకథ చెప్పినా హీరోయిన్‌ పాత్రని అలా మార్చండి వెరైటీ ఎలిమెంట్‌ ఏదైనా కధలో పెట్టండి అంటూ సూచనలు ఇస్తున్నట్లు టాక్. దీనితో చాలమంది యంగ్ డైరెక్టర్స్ సమంతకు కథ చెప్పడానికి భయపడి పోతున్నారని వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు అనేకమంది యంగ్ డైరెక్టర్స్ సమంతకు కథలు చెప్పి ఒప్పించే సమయంలో మరొక చిన్న సినిమాను తీసుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. 

దీనితో సమంత సినిమాలు చేసే ఉద్దేశ్యం లేక ఇలా ప్రవర్తిస్తోందా లేదంటే ఆమె మనసులో మరేదైనా ఉద్దేశాలు ఉన్నాయా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సమంత ఒక వెబ్ సిరీస్ తెలుగు తమిళ భాషలలో తీస్తోంది అని వార్తలు వస్తున్నా ఈ విషయాలను రహస్యంగా సమంత కొనసాగిస్తూ ఉండటంతో అసలు సమంత వ్యూహాలు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: