గోవా బ్యూటీ ఇలియానాకు మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయా అంటే అవుననే అంటున్నాయి సిని వర్గాలు. చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానా ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా రిజల్ట్ అటుంచితే ఇల్లి బేబ్ లుక్స్ వైజ్ కూడా తన ఫ్యాన్స్ ను మెప్పించలేదు.  


ఇక ఈమధ్యనే తన లవర్ తో విడిపోయిన అమ్మడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలో తన ఫిజిక్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుందట. అయితే లేటెస్ట్ గా ఇలియానాకు మరో తెలుగు సినిమా ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమాలో ఇల్లి బేబ్ కు ఛాన్స్ దక్కిందని టాక్.


తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన ఇలియానా సీనియర్ స్టార్స్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ కొరత గురించి తెలిసిందే. ఖైది నంబర్ 150లో కాజల్ తో జత కట్టిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా కోసం హీరోయిన్స్ వేట మొదలుపెట్టారు. మొన్నామధ్య ఈ మూవీలో నయనతారం, అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్స్ పేర్లు వినపడ్డాయి. కాని వారెవరు ఫైనల్ కాలేదని తెలుస్తుంది.  


కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ఫైనల్ అయ్యిందట. సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఇలియానా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. ఒకవేళ చిరు సినిమాలో ఇలియానా నటించేది నిజమే అయితే మళ్లీ అమ్మడికి తెలుగులో ఫాం లోకి వచ్చినట్టే. ఈ మూవీపై అఫిషియల్ న్యూస్ మరికొద్దిరోజుల్లో బయటకు వస్తుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: