బాహుబలి ద్వారా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఇండియాలో పెద్ద ఇండస్ట్రీ అని చెప్పుకునే బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా రికార్డు స్థాయి వసూళ్ళను సాధించింది. మనకు ఇంత మార్కెట్ ఉందా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. బాహుబలి ద్వారా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ పోయి వాటిస్థానంలో బాహుబలి వచ్చి కూర్చుంది. ఇప్పుడు బాహుబలి దర్శకుడి మరో సినిమా కూడా మొదలైంది.


రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరెకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా టైటిల్ ఏంటనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అందరికీ ఆర్ ఆర్ ఆర్ అంటేనే అర్థం అవుతుంది. ఈ షూటింగ్ లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బల్గేరియాలో చిత్ర బృందం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇదిలా ఉండగా ఒక విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


ఆర్ ఆర్ ఆర్ సినిమాకు డివివి దానయ్య 400 కోట్ల భారీ బెడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. బాహుబలి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని అంత భారీ బడ్జెట్ పెట్టడానికి్  నిర్మాత వెనకాడటం లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం తాజాగా చర్చనీయాంశం అయింది. ఇద్దరికీ చెరో రూ. 25 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది.


 
మామూలు సినిమాలకు రామ్ చరణ్, ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ సగటున రూ. 15 కోట్ల వరకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఆర్ ఆర్ ఆర్  ప్రత్యేకమైన సినిమా కావడంతో వీరికి రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట.  మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఏదేమైనా ఈ సినిమా విజయం సాధిస్తే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి ఇండియా వైడ్ మొత్తంలో పేరు రావడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: