రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గెరియాలోని అడవుల్లో జరుగుతున్నది.   తెలంగాణా వీరుడు కొమురం భీం కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.  త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారు.  ఇదిలా ఉంటె, ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోకాపేట పరిసరాల్లో జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి అక్కడ హంగామా చేశారు. 

హంగామా చేయడం అంటే ఏంటో అనుకుంటారేమో.. అదే కాదు.  షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడి విషయాలను ప్రైవేట్ గా ఫోన్ లో షూట్ చేయడం మొదలుపెట్టాడు.  అయితే ఆ దృశ్యం రాజమౌళి కుమారుడు కార్తికేయ దృష్టికి రావడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే ఈ విషయం రాజమౌళి దృష్టికి తీసుకెళ్లారు.  రాజమౌళి ఆ వ్యక్తి దగ్గర ఫోన్ లాక్కొని పగలగొట్టారు.  అలా చేయకుండా ఉన్నట్టయితే.. ఈ పాటికి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన చాలా లుక్స్ బయటకు లీక్ అయ్యేవి.  


మీడియాలో పెద్ద వైరల్అయ్యేది.  షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఏదో ఒకవిధంగా లీక్ అవుతూనే ఉన్నాయి.  కొన్ని సందర్భాల్లో ఈ లీకేజీలు చాలా పెద్ద డ్యామేజీ చేస్తాయి.  ఏదైనా మెయిన్ సన్నివేశం జరుగుతుంటే.. ఆ సన్నివేశం లీకైతే కనుక ఎంత పెద్ద నష్టం వస్తుందో చెప్పక్కర్లేదు.  అందుకే సినిమా విషయంలో రాజమౌళి అండ్ కో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  


అంతకు ముందు కూడా ఇలాంటి లీకేజీలు బోలెడు జరిగాయి.  ఒక్క ఆర్ఆర్ఆర్ విషయంలోనే కాదు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తుంటే.. సినిమాపై ఉన్న క్యూరియాసిటీ తగ్గిపోతుంది.  అందుకే యూనిట్ జాగ్రత్తలు పడుతున్నది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్.  ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: