టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణతో నటించిన సీనియర్ హీరోల కొడుకులు చాలామంది ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ మరియు నాగ చైతన్య ఇప్పటికే సినిమాలు చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్ అందరికంటే ముందుగానే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వీరు చాలా సక్సెస్ ఫుల్ గా తండ్రి పేరు నిలబెడుతూ అద్భుతమైన సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటువంటి క్రమంలో నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుండో నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా సెప్టెంబర్ 6వ తారీఖున నందమూరి మోక్షజ్ఞ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న క్రమంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఖాయమని అంటున్నారు నందమూరి బాలకృష్ణ సన్నిహితులు.


ఇందుమూలంగానే ఈ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నందమూరి అభిమానులు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయడానికి అభిమానుల్లో ఇప్పటికే భారీ ఏర్పాటు చేస్తున్నారు. గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారెంటీ అని అనేక వార్తలు వచ్చాయి అయితే రాను రాను మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుండడంతో రెండు నెలలకు ముందు మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక పిక్ సోషల్ మీడియాలో చాలా లావుగా కనబడటంతో మోక్షజ్ఞ సినిమాలకు దూరం గా వుంటూ వ్యాపారం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అప్పట్లో వార్తలు రావడం జరిగాయి.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా 25వ పుట్టినరోజు నాడు కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి స్పష్టమైన వార్త ఒకటి రావడం ఖాయమని ఇందు మూలంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఈ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపపోతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: