చేయాల్సిదంతా చేసి చివరిలో హింస పెరిగిపోతుందంటూ బిగ్ బాస్ సోది కబుర్లు చెప్పడం బుధవారం ఎపిసోడ్ లో బాగానే జరిగింది. మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు ఇచ్చిన దొంగలు దోచిన నగరం టాస్క్ బుధవారం కూడా కొనసాగింది. ఇంటి సభ్యులు దొంగలు ముఠా, నగర వాసులుగా విడిపోయి తన్నుకోవడం రెండో లెవెల్ ల్లోకి వెళ్లింది. దొంగలు ముఠా రాణిగా శిల్పా చక్రవర్తి ఉంటే ఆమె ముఠాలో దొంగలుగా వరుణ్,రవి, రాహుల్, పునర్నవి,శివజ్యోతిలు ఉండగా, నగర వాసులుగా బాబా భాస్కర్, అలీ, మహేశ్, శ్రీముఖి, హిమజ, వితికలు ఉన్న విషయం తెలిసిందే.


బుధవారం టాస్క్ లో రెండు లెవెల్ లో నగర వాసులు దొంగల ముఠా రాణి చేతిలో ఉన్న గన్‌ను తీసుకుని ఆమెను జైలులో బంధించాలి. అటు దొంగల ముఠా ఆమెని కాపాడుకోవాలి. ఈ తరుణంలో శిల్పా గన్ ని నడుముకు గట్టిగా కట్టేసుకుంది. దీంతో అలీ ఆ గన్ ని లాక్కునే ప్రయత్నం చేశాడు. అడ్డొచ్చిన వారిని ఎత్తి అవతల వేశాడు. ఈ క్రమంలో శిల్పా స్విమ్మింగ్ పూల్ లో దూకేసింది. ఇక అలీ మిగతా నగర వాసులు కూడా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లారు. అటు తమ రాణిని కాపాడుకోవడానికి దొంగల ముఠా కూడా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లారు.


ఇక ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది. స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరి దాడి చేసుకున్నారు. శిల్పాని అయితే ఎవరికి వారే గట్టిగా పట్టేసుకుని చుక్కలు చూపించారు. ఒకానొక సమయంలో అలీ, రాహుల్ లు గట్టిగా తలపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోడానికి కూడా సిద్ధమయ్యారు. ఇలా స్విమ్మింగ్ పూల్ లో రచ్చ గమనించిన బిగ్ బాస్ టాస్క్ లో హింస పెరిగిపోయిందని ఈ టాస్క్ ఇంతటితో ఆపాలని సూచించాడు. అసలు టాస్క్ కొట్టుకుని చావమని ఇచ్చిన బిగ్ బాస్ చివరికి హీరోలా హౌస్ లో హింసకు చోటు లేదంటూ పెద్ద క్లాస్ ఇచ్చాడు. టాస్క్ ప్రకారం చూస్తే అందులో బలప్రదర్శన తప్పనిసరిగా ఉంటుంది. అలా కాకుండా టాస్క్ ఆడటం కష్టమే. మొత్తానికి టాస్క్ లో ఎవరు గెలవకుండా ఆగిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: