రామ్ గోపాల్ వర్మ... అయన ఏం చేసిన ఏం మాట్లాడిన అదో సంచలనం . అయన చుట్టూ వివాదాలు తిరుగుతాయా ... లేక వర్మనే వివాదాల చుట్టూ తిరుగుతాడా తెలీదు కానీ ... ఎప్పుడు ఎదో ఒక వివాదం తో తెరమీదకి వస్తూనే ఉంటాడు సంచలనాల వర్మ . వర్మ చేసే పనులు చూస్తుంటే నా దారి రహ దారి... డోంట్ కమ్ ఇన్ మై వె అని రజినీకాంత్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది . అందరి స్టైల్ ఒకటైపైతే ... వర్మ స్టైల్ ఇంకో టైపు ...అదో టైపు .వర్మ  ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్స్ చేస్తాడో అసలు ఎవ్వరు ఊహించలేరు. ఊహకందని రీతిలో అయన ఆలోచనలు ఉంటాయి .


ఇప్పుడు వర్మ మేటర్ ఎందుకొచ్చిందంటే ... సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు అన్న విషయం అందరికి తెలిసిందే  . మరి ఈ ఉపాధ్యాయ  దినోత్సవం రోజు ఏం చేస్తారు . తమ తమ ఉపాధ్యాయులకు ... టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతారు .కొంత తమకి తోచిన బహుమతిని ఉపాధ్యాయులకు ఇస్తారు . తమకి విద్య బుద్దులు నేర్పిన  ఉపాధ్యాయులను స్మరించుకుంటారు ఈరోజు అంతా .


అయితే మన సంచలనాల దర్శకుడు వర్మ కూడా అదే చేసాడు . దాంట్లో తప్పేంటి అంటారా ...వర్మ రూటే సెపెరేట్ కాబట్టి ...అయన స్టైల్ లో వర్మ తన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు .నాకు   చదువు చెప్పిన గురువులు నాకు సరిగ్గా  విద్యా బుద్దులు నేర్పలేదు. అందుకే నేను మంచి స్టూడెంట్ కాలేకపోయాను. అంతేకాదు కనీసం మంచి హ్యుమన్ బీయింగ్ కాలేకపోయాను. అందుకే గురు పుజోత్సవం రోజున  ఏం చెప్పాలో కూడా  తెలియడం లేదు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు . కాగా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో  తెగ వైరల్ అవుతుంది  . 



మరింత సమాచారం తెలుసుకోండి: