ఈరోజు టీచర్స్ డే జరుగుతున్న సందర్భంలో దేశ వ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు తమ జీవితాలను ప్రభావితం చేసిన తమ గురువులను గుర్తుకు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వివాదాల దర్శకులు రామ్ గోపాల్ వర్మ టీచర్స్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన ట్విట్ సంచలనంగా మారింది. 

‘ఈ రోజు దేశంలో టీచర్స్ విస్కీ త్రాగి సెలిబ్రేట్ చేసుకుంటారా అంటూ జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్విట్ చేసాడు. అంతేకాదు ఈ ట్విట్ కు టీచర్స్ డే అన్న స్లోగన్ తో విస్కీ బాటిల్స్ ను పెట్టి తన ఫోటోను కూడ జోడించాడు. ‘నన్ను మంచి విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో నా టీచర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. అందువల్ల నాకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదు' అంటూ మరొక ట్విట్ చేసాడు. 

అంతేకాదు ‘నేను ఒక బ్యాడ్ స్టూడెంట్‌ను. నన్ను మంచిగా చేయలేకపోయిన టీచర్స్ కూడా గుడ్ కాదు' అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో పరమ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న టీచర్స్ ను వర్మ అవమానిస్తున్నాడు అంటూ వర్మ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అందరికీ నచ్చే సినిమాలు తీయలేక ఖాళీగా కూర్చున్న వర్మ ఇలా ఎదో ఒక వివాదాస్పద విషయం పై స్పందిస్తూ తాను ఇంకా సంచలనాలు చేయగలను అంటూ పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తున్నాడు. 

ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే వివాదాస్పద సినిమాను తీస్తున్న వర్మ రెండు ప్రముఖ కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ చిచ్చును కాసులుగా మార్చుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ మూవీ టైటిల్ కు సెన్సార్ అంగీకరిస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. వివాదాలు ఎంత ఎక్కువగా వస్తే రామ్ గోపాల వర్మకు అంత పాపులారిటీ పెరిగి పోతూ ఉంటుంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: