టాలీవుడ్ దేశంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించే అతి పెద్ద సినీ కర్మాగారంగా చూస్తారు. ఇక్కడ దిగ్దర్శకులు  ఎందరో ఉన్నారు. టాలెంటెడ్ టెక్నీషియన్లు ఉన్నారు. మేటి నటులు కూడా టాలీవుడ్లో కనిపిస్తారు. మంచి కధకులు, స్క్రీన్ ప్లే రైటర్లు ఇలా టాలీవుడ్ దేనికీ తక్కువ కానంతగా ఎదిగింది. అయితే టాలీవుడ్ ప్రతిభకు తగ్గట్టుగా విజయాలు వస్తున్నాయా.


అంటే ఇది పెద్ద డౌటే. టాలీవుడ్లో హిట్ల శాతం నానాటికీ పడిపోతోంది. దానికి కారణం సరైన ప్లానింగ్ తో మూవీస్ తీయలేకపోవడం, మరో వైపు కధని వదిలేసి సాము చేయడం. ఇక టాలీవుడ్లో మరో లోపం ఏంటి అంటే పేపర్ మీద  వర్క్ చూసి మురిసిపోతారు. అది సెల్యూలాయిడ్ మీద కనిపించేంతవరకూ ఆ టెంపోని కొనసాగించరని అంటారు. అలా మెదడులో పుట్టిన ఆలోచనను తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసేవారు నాడు కె విశ్వనాధ్ అయితే, నేడు రాజమౌళి అంటారు. ఈ ఇద్దరూ తాము అనుకున్న ఎఫెక్ట్ వచ్చేంతవరకూ అసలు ఆగరు. వారిని ఏమనుకున్నా సరే తమ ఆలోచన తెరమీదకు ఎక్కాల్సిందేనని పట్టుపడతారు. అందుకే ఇద్దరినీ పద్మ అవార్డులు వరించాయి.



ఇక టాలీవుడ్లో ఎక్కువగా కాంబోలను నమ్మి మూవీస్ చేస్తారు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ విజయాలను ముడి పెట్టి కొత్త మూవీకి రెడీ అయిపోతారు. దాంతో దెబ్బ తినేస్తున్నారు. మరొటి ఏంటి అంటే లావిష్ గా ఖర్చు చేస్తే సినిమా హిట్ అన్న దారుణమైన అభిప్రాయం. ఈ కారణంగా ఎంతో మంది నిర్మాతలు షాక్ తినిపోయారు. 


ఇపుడు బాహుబలి ఇపుడు టాలీవుడ్ ని పట్టి కుదిపేస్తోంది. బాహుబలికి కళ్ళు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. దాంతో అందరూ ఇపుడు అదే బాటలో నడుస్తున్నారు. అయితే అక్కడ ఉన్నది రాజమౌళి. ఆయన మార్కెటింగ్, ప్లానింగ్ అన్నీ కూడా పక్కాగా ఉంటాయి. మరి మిగిలిన సినిమాలకు స‌త్తా ఉన్న  డైరెక్టర్లు ఉంటారు, హీరోలు ఉంటారు. కానీ మార్కెటింగ్ చేసే టాలెంట్ ఎంతమందికి ఉంది. అది కూడా నేర్చుకుంటేనే బాహుబలి లాంటి భారీ విజయాలు దక్కుతాయి. లేకపోతే అంచనాలు అకాశంలోనే ఉంటాయి. సినిమాలు నేల చూపులు చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: