బాలీవుడ్ అందాల తార కృతి సనన్. ఈ భామ ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అద్దె గర్భం స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మిమి అనే సినిమాలో మెయిన్ రోల్ ను పోషిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌ లో రూపొందిన 1 నేనొక్కడినే సినిమా ద్వారా కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ మధ్య విజయవంతమైన లుకా చుప్పీ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై కృతి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.


అయితే ఇప్పుడు మిమి అనే సినిమాస స్టోరీ అత్యంత భావోద్వేగపూరితమైంది. కథ చెప్పినప్పుడు ఒకింత ఎక్సైటింగ్‌గా, కొంత నెర్వస్‌గా ఫీలయ్యాను అంటున్నారు కృతి. ఇంకా ఇప్పటి వరకు  తాను చేయనటువంటి పాత్ర తనకు లభించిందని మురిసిపోతున్నారు. అనేక రకాల ఎమోషన్స్ పలికించే సినిమాగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నటిగా తనకు ఛాలెంజ్ అని కృతిసనన్ వివరించారు. ‘మిమి సినిమా నటిగా నాకు బాధ్యతను నేర్పే సినిమా. నేను కొత్తగా, విభిన్నమైన పాత్రలు ధరించాలని ఆలోచిస్తున్నపుడు నాకు ఆ పాత్ర లభించింది. అలాగే ఎన్నో ఏళ్లుగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటించాలని చూస్తున్నాను. ఆ క్రమంలో నాకు ఈ పాత్ర, సినిమా లభించడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని కృతి సనన్ తెలిపారు.


అంతేకాకుండా మిమి సినిమాపై ఇంకా కృతి సనన్ స్పందిస్తూ.. ‘లైఫ్ అనేది ఊహించని అద్భుతాలతో సాగే ఓ ప్రయాణం. ఇంతకు ముందెన్నడూ లేని ప్రయాణానికి గెట్ రెడీ అవుతున్నాను. ఇది నాకు అత్యంత ప్రత్యేకమైనది. నా హృదయానికి దగ్గరైన సినిమా’ అంటూ కృతి సనన్ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ సినిమా నవ్విస్తుంది. ఏడిపిస్తుంది? ఫీల్‌గుడ్ ఎమోషన్స్ పలికిస్తుంది.

అన్ని రకాల భావోద్వేగాన్ని పండిస్తుంది. దర్శకుడు లక్ష్మణ్ సార్ ఎమోషన్స్‌ను వినోదాత్మకంగా తెరపైన చెబుతున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు ఓ చక్కటి అనుభూతిని పొందుతారు అని కూడా కృతి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: