టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల మహర్షి సినిమా సక్సెస్ తో కేరీర్ పరంగా అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్, కెరీర్ లో తొలిసారి ఈ సినిమాలో ఒక మిలటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాల్లో తప్ప మరొక భాషలో నటించని మహేష్ బాబుపై, కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల్లో నటించమని ఫ్యాన్స్ అలానే సినిమా పరిశ్రమలోని కొందరి నుండి ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. అయితే బాలీవుడ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా, మన సూపర్ స్టార్ మాత్రం ఇంటరెస్ట్ లేదనే చెప్తూ వస్తున్నారు. 

అయితే ఆయన బాలీవుడ్ కి వెళ్లకపోవడానికి కారణాం ఇదేనంటూ ఒక వార్త నేడు ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, కొన్నేళ్ల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాతో బాలీవుడ్ కి వెళ్లడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ సినిమా ఘోర పరాజయాన్ని అందుకోవడంతో, చరణ్ మరొక్కసారి హిందీ లో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా చరణ్ బాలీవుడ్ ఎంట్రీ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారట. ఇకపోతే బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. 

నిజానికి బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు హిందీలో డబ్ చేయబడి రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో, ప్రభాస్ కు నార్త్ లోకి మంచి క్రేజ్ రావడం జరిగింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన సాహో సినిమా, తెలుగు తో పాటు హిందీలో కూడా ఏకకాలంలో చిత్రీకరించబడడంతో, అక్కడి ప్రేక్షకుల్లో సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయని, అయితే సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలు అందుకోలేక నెగటివ్ టాక్ సంపాదించి ప్రస్తుతం అక్కడ నత్తనడకన నడుస్తున్నట్లు చెప్తున్నారు. దీనిని బట్టి, తనకు సరైన కథ, కథనాలతో పాటు తనను సక్రమంగా బాలీవుడ్ లో లాంచ్ చేయ గల దర్శకుడు దొరకనంతవరకు మహేష్ బాబు అక్కడ సినిమా చేయకపోవచ్చని అంటున్నారు. మొత్తంగా జంజీర్ తో చరణ్, సాహో తో ప్రభాస్ అక్కడ చతికిల పడడంతో, తన పరిస్థితి కూడా అలా కాకూడదని భావించి, సరైన సమయం కోసం మహేష్ వేచి చూస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, మహేష్ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం సరైన దర్శకుడితో జరిగితే బెటర్ అని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: