టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి, సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు జర్ర జర్ర ప్రోమో వీడియో సాంగ్, వీక్షకులను విపరీతంగా ఆకర్షించి, సినిమాపై అమాంతం అంచనాలు పెంచేయడం జరిగింది. 

ఇక కాసేపటి క్రితం ఈ సినిమా నుండి గగన వీధిలో అనే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా టీజర్ లో తన ఆకట్టుకునే నటన మరియు డైలాగ్స్ తో వరుణ్ అదరగొట్టాడు. కెరీర్ లో మొదటి సారి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న వరుణ్, ఆ పాత్రకు జీవం పోసినట్లు చెప్తున్నారు యూనిట్ సభ్యులు. తమిళ సినిమాలోని ప్రధాన మాతృక ను తీసుకుని దర్శకుడు హరీష్ శంకర్, మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సినిమాని చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా మరింతగా అలరిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాలో వరుణ్ పాత్ర కీలకమని, 

అలానే సినిమాలో వచ్చే భారీ యాక్షన్ మరియు ఫైట్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ నిలుస్తాయని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే, ఫస్ట్ టైం ఒక పెల్లుటూరి అమ్మాయి పాత్రలో ఎంతో బాగా ఒదిగి పోయి నటించినట్లు సమాచారం. ఇక తమిళ నటులు అధర్వ, మృణాళిని రవి ల జంట కూడా స్క్రీన్ పై అదిరిపోనుందని టాక్. మొత్తంగా రేపు రిలీజ్ తరువాత, ఈ వాల్మీకి సినిమా అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతో అలరిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా వాల్మీకి నిజంగా ప్రేక్షకులను అలరిస్తే మాత్రం, గత సినిమా డీజె తో కాస్త ఢీలాపడ్డ హరీష్ కు వాల్మీకి ద్వారా మంచి విజయం దక్కినట్లే మరి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: