ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో మారుమోగిపోయిన పేరు తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ 3 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె హౌస్ లో ఘాటు మాటలతో అటు ప్రేక్షకులకి ఇటు కంటెస్టెంట్స్ కి చాలా వెగటు పుట్టించింది. సీరియల్ యాక్టర్ రవి కృష్ణ ను వ్యక్తిగతంగా దూషించిన ఆమె ప్రవర్తన చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఆమెను ఒక వారానికే ఎలిమినేట్ చేసేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేశ్ కి పొటీగా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ ట్రాన్స్ జెండర్ తనకున్న కొంత మంచి పేరును కూడా బిగ్ బాస్ షో ద్వారా కోల్పోయింది.

ఈమధ్య కొన్ని టీవీ చానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇస్తూ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పిన తమన్నా తనకు సంబంధించిన ఒక పర్సనల్ విషయం గురించి చాలా బోల్డ్ గా మాట్లాడింది. ఓ ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెని మీరు వర్జినా? అని ప్రశ్నించగా ఆమె కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పింది. 'తాను వర్జిన్ కాదని ఇందులో అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు' అని ఆమె స్పష్టం చేసింది. మొహమాటపడకుండా తాను తన 17వ యేటనే కన్యత్వాన్ని పోగొట్టుకున్నట్టు చెప్పుకొచ్చింది తమన్నా.

అంతటితో ఆగకుండా "అంత వయసున్న… ఇంకా పెళ్లి కాని సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా? నేను కూడా అంతే," అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఆమె అన్న మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయాయి. అయితే తన శరీరం వర్జిన్ కాకపోయినా తన మనసు మాత్రం వర్జినే అంటూ చివర్లో కొసమెరుపు ఇచ్చింది. ఇప్పుడు తన దృష్టి సినిమాలపైనే ఉందని సినిమాల్లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఒక మంచి రాజకీయవేత్తగా మారుతానని ఆమె తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: