మహర్షి లాంటి భారీ బ్లాక్ బ్లాస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్  మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా  అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతుంది. ఇక  ఈ సినిమాలో మహేష్ బాబు, ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. మహేశ్ సరసన రష్మిక మందన్న, కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను చిత్రయూనిట్ కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపులో చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబా‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  
 ఈ సినిమాని  రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాతికి ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ విషయమై టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఇటీవలి కాలంలో మహేష్ తన సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోవడం మానేసి నాన్ థియేట్రికల్ రైట్స్‌ను తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు.

మహర్షి సినిమాకు కూడా మహేష్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు. దీనితో  ఆయనకు శాటిలైట్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్, ఆడియో తదితర హక్కులన్నీ కలిపి దాదాపు రూ.45 కోట్ల వరకూ వచ్చాయని సమాచారం. ఇలా రెమ్యునరేషన్‌కి బదులుగా  నాన్ థియేట్రికల్ రైట్స్‌ను తీసుకోవడం వల్ల మహేష్‌తో పాటు నిర్మాతకు కూడా కాస్త బడ్జెట్ విషయంలో కలిసి వస్తుంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరుకి కూడా మహేష్ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు టాక్. దీంతో ఈ సినిమాకు మహేష్‌కు రూ.52 కోట్ల వరకూ ముట్టనున్నాయని సమాచారం. ఇదే నిజమైతే మహేష్ రెమ్యునరేషన్ విషయంలో మహేష్‌కెవ్వరూ సరిలేరు అని చెప్పాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: