చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగిన ఈతరం టాలెంటెడ్ ఆర్టిస్టులలో శ్రీ విష్ణు ఒకరు. ఐదారేళ్ల క్రితం సినిమాలో అతను ఎలాంటి ఐడెంటిటీలేని పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పుడు హీరో అయ్యాక ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ ఆడియెన్స్ అతన్ని ఇదవరకు సినిమాల్లో వేసిన పాత్రలను చూసి షాక్ అవుతున్నారు.   


చిన్న బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీ విష్ణు రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన ఇమేజ్ పెంచుకుంటున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా మరో క్రేజీ మూవీతో రాబోతున్నాడు. అదే తిప్పరా మీసం. కృష్ణ విజయ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను రిజ్వాన్ నిర్మిస్తున్నారు.  


సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. ఎప్పటిలానే తన సినిమా టీజర్ తో అంచనాలు పెంచేశాడు శ్రీ విష్ణు. మందు, సిగరెట్టు మాత్రమే కాదు శత్రువు కూడా ఒక వ్యసనమే అంటూ ఓ కొత్త స్టేట్ మెంట్ తో మాస్ అండ్ యాక్షన్ సినిమాగా తిప్పరా మీసం చేస్తున్నాడు. సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.


భారీ బడ్జెట్ సినిమాల హవా ఎలా ఉన్నా శ్రీ విష్ణు సరైన టైం చూసి తన సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొడుతుంటాడు. టీజర్ చూస్తుంటే తిప్పరా మీసం సినిమా కూడా మరో హిట్ శ్రీ విష్ణు ఖాతాలో వేసేలా ఉంది. శ్రీ విష్ణు వన్ మ్యాన్ షోగా వస్తున్న తిప్పరా మీసం సినిమా రిలీజ్ డేట్ పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.  చిన్న బడ్జెట్ సినిమాలతో ప్రయోగాలు చేయాలంటే అది శ్రీ విష్ణు తర్వాతే ఎవరైనా అనేలా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ సినిమా నిజంగానే శ్రీ విష్ణుని మీసం తిప్పుకునేలా చేస్తుందో లేదో చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: