బుల్లితెర మీద జోడీలు ఎక్కువయ్యాయని చెప్పాలి. కలిసి షో చేసినంత మాత్రాన వాళ్ల మధ్య సంథింగ్ ఏదో ఉందని అనుకోవడం పొరపాటే. కాని ఆడియెన్స్ కు లేని ఆలోచనలోని కూడా వారే కల్పిస్తున్నారు బుల్లితెర జోడీలు. ముఖ్యంగా యూట్యూబ్ జోడీగా బాగా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్, రష్మిక జంట రచ్చ రోజు రోజుకి పెరుగుతుంది.


రష్మి ప్రేమ కోసం సుధీర్ ఎపిసోడ్లకు ఎపిసోడ్లు వెయిట్ చేస్తుంటాడు. రష్మి కూడా సుధీర్ ను అనరాని మాటలతో ఏడిపిస్తుంది. రష్మి ఒక్కసారి ప్రేమగా పిలిస్తే చాలు సుధీర్ కిందా మీద పడిపోతాడు. చేసేందంతా చేసి మీ మధ్య ఎలాంటి రిలేషన్ లేదా అంటే ఎబ్బే అదంతా షోలో భాగమే అది కూడా ఒక స్క్రిప్టే అంటుంటారు.


జబర్దస్త్ షోలో కమెడియన్, యాంకర్ గా ఉన్న సుధీర్, రష్మి ఢీ షో వల్ల టీం లీడర్స్ గా మారారు. ఇప్పటికి రెండు సీజన్ల నుండి ఈ ఇద్దరే ఢీ షోకి టీం లీడర్స్ గా చేస్తున్నారు. ఢీ షోలో డ్యాన్సులతో పాటుగా యాంకర్ ప్రదీప్.. సుధీర్, రష్మిలతో ఆడుకునే ఆట చాలా కామెడీగా ఉంటుంది. 


ఎలాగోలా ఢీ జోడి ముగింపు దశకు వచ్చింది. గ్రాండ్ ఫైనల్స్ కు మరో వారం మాత్రమే ఉంది. ఈ షో ముగిశాక సుధీర్, రష్మిల జోడీకి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇద్దరి కామెడీ టైమింగ్ బాగున్నా రష్మి ప్రేమ కోసం సుధీర్.. అతన్ని రిజెక్ట్ చేస్తూ రష్మి ఇలా సాగదీయడం బుల్లితెర ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. కచ్చితంగా ఈసారి ఢీ అంటూ పెడితే ఈ జోడీకి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. ఆల్రెడీ ఢీ జోడి మొదటి ఎపిసోడ్ లో భాను శ్రీని పెట్టి మొదలు పెట్టారు కాని సుధీర్, భానుల జోడీ కుదరలేదు. అందుకే మళ్లీ రష్మిని తప్పించారు. ఓ పక్క సినిమాలు చేస్తూ బుల్లితెర షోలు చేస్తున్న రష్మి అయినా పెళ్లి చేసుకుని ఇలాంటి వార్తలకు బ్రేక్ వేస్తే బెటర్.  



మరింత సమాచారం తెలుసుకోండి: