బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో స్ట్రాంగ్ అండ్ క్రేజీ కంటెస్టంట్స్ లో ఒకరు యాంకర్ శ్రీముఖి. హౌజ్ లో అందరిని ఓ కంటితో అబ్సర్వ్ చేస్తూ వస్తున్న శ్రీముఖి తనంతట తాను గొడవ పెట్టుకోకున్నా తన వల్ల ఇంటి సభ్యుల మధ్య గొడవలకు కారణం అవుతుందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె ఇంట్లో కొందరి మాయలో పడిందని అంటున్నారు.       


శ్రీముఖి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఇన్ బిగ్ బాస్ హౌజ్ ఈ విషయంలో డౌట్ లేదు. కాని ప్రతి టాస్క్ లో ఆమె తనకు ఇంట్లో నచ్చని కంటెస్టంట్ రాహుల్ ను టార్గెట్ చేస్తుంది. అంతేకాదు కంటెస్టంట్స్ అందరిలో ఆలి రెజా, బాబా భాస్కర్ లతో క్లోజ్ గా ఉంటుంది. అలి, శ్రీముఖి ఈమధ్య బాగా క్లోజ్ అయ్యారని చెప్పొచ్చు.   


టాస్కులలోనే కాదు శ్రీముఖి, అలిలు ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయం మీద డిస్కస్ చేస్తూనే ఉంటున్నారు. ఈరోజు జరిగిన శాండ్ టాస్క్ లో కూడా అలి శ్రీముఖిని కెప్టెన్ గా చేయాలని అనుకున్నాడు.. కాని బాబా భాస్కర్ గెలిచాడు. శ్రీముఖికి సపోర్ట్ చేసే క్రమంలోనే ప్రస్తుతం కెప్టెన్ వరుణ్ సందేశ్ తో పాటుగా పునర్నవితో గొడవపడ్డాడు.   


ఇంతకీ అసలు శ్రీముఖి గేమ్ ప్లాన్ ఏంటి.. ఒకవేళ ఇంతమందిలో అలి ఇప్పుడు కంఫర్ట్ గా అనిపించినా ఎప్పుడో ఒకసారి వారిద్దరికే టాస్క్ పడి.. అది గెలిస్తేనే హౌజ్ లో ఉండేది అన్నప్పుడు ఏం చేస్తుంది. ఏది ఏమైనా హౌజ్ లో ఎవరి గేమ్ ప్లాన్ వారిది. బయట పడేది కొందరైతే లోపల దాచుకుని మైండ్ గేమ్ ఆడేవారు మరికొందరు. ఏం చేసినా ఎలా చేసినా బయట ఆడియెన్స్ కు నచ్చిన వారే ఫైనల్ విన్నర్ అవుతారు.       



మరింత సమాచారం తెలుసుకోండి: