కొన్ని సినిమాలు నటీనటుల కెరీర్ నే మలుపుతిప్పుతాయి. అలాంటి అవకాశమే ఇప్పుడు నందిత శ్వేతకు వచ్చిందా.. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తప్ప ఆమెకు పెద్దగా సక్సస్ లు లేవు. కానీ తన నటనపై నమ్మకం ఉన్న ఆమె తాజాగా విడుదల కాబోతున్న అక్షర సినిమాపై ఆశలు పెట్టుకుంది.


నిర్మాత, దర్శకులు కూడా అక్షర సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ అనీ తప్పకుండా నందిత శ్వేతకు మంచి పేరు తెస్తుందని అంటున్నారు. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న "అక్షర" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గతంలో విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన కథ ఇది. నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండానే అద్భుతమైన మెసేజ్ తో వస్తోన్న అక్షర షూటింగ్ పూర్తయింది..అంటున్నారు నిర్మాతలు సురేష్ వర్మఅల్లూరి, అహితేజ బెల్లంకొండ..


దర్శకుడు బి. చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ‘‘అవుట్ పుట్ పై మాకు పూర్తి సంతృప్తిగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఫుల్ స్వింగ్ లోసాగుతున్నాయి. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకుదర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్. మొత్తంగాఅక్టోబర్ ద్వితీయార్థంలో వస్తోన్న మా అక్షర మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.


నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్,షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. సినిమాను అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గావిడుదల చేయబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: