మెగా స్టార్ చిరంజీవి నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా విడుదలకు సిద్దమవుతుంది. అందులో  భాగంగా ఇప్పటికే  ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో  రికార్డులు సృష్టిస్తుంది.  ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్  సూపర్ రెస్పాన్స్ ను రాబట్టి  సినిమా ఫై అంచనాలను మరింతగా పెంచేసింది.  ఇక ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  ఈచిత్రం నుండి మొదటి సాంగ్ ను ఈ నెల 10 న విడుదల చేసి  ట్రైలర్ ను  ఈనెల 15న విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ  విడుదల విషయం లో  అధికారిక ప్రకటన రావాల్సివుంది.  





తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా లెజెండరీ యాక్టర్   బిగ్ బి అమితాబ్ బచ్చన్,  జగపతి బాబు  విజయ్ సేతుపతి , రవి కిషన్   ,సుధీప్, తమన్నా  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ మ్యూజిక్  డైరెక్ట్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా   కొణిదెల ప్రొడక్షన్స్  పతాకంఫై  రామ్ చరణ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ ,తమిళ భాషల్లో విడుదలకానుంది.





ఇక ఇప్పటికే  కన్నడ , హిందీ లో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తికాగా  తమిళ ,మలయాళ వెర్షన్ ల  బిజినెస్ విషయం ఫై క్లారిటీ రావాల్సివుంది.  కాగాతెలుగులో   ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తికాగా ఓవర్సీస్ లో మాత్రం ఇంకా ఈసినిమా హక్కులను ఇంకా  ఎవరికి అమ్మలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: