టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు, యాడ్ లలో కనిపించి తన అభిమానులకు ఆనందాన్ని పంచుతారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మహర్షి సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మహర్షి సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. ఇప్పుడు చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసరుగా కనిపించనున్నారు.


 
మాస్ సినిమాల్లో కామెడీని చొప్పించి అద్భుత విజయాలు అందుకున్న  దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకత్వం వహించిన ఎఫ్ 2 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా కడుపుబ్బా నవ్వించే సీన్లు పుష్కలంగా ఉన్నాయని టాక్.అయితే అదలా ఉంచితే  మహేష్‌బాబు ఇటీవల సంతూర్ యాడ్ లో కనిపించారు.


ఆ యాడ్ లో మహేష్ ల్ వయసు మీద పడుతున్నా కొద్ది యంగ్‌ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాడు. ఇటీవలే తన కొడుకు గౌతమ్‌ టీనేజ్‌లోకి ఎంటర్‌ అయ్యాడు అంటూ ప్రకటించిన మహేష్‌బాబు తాను కూడా ఇంకా టీనేజ్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాడు.  తాజాగా ఆ యాడ్‌ బయటకు వచ్చింది.సోషల్‌ మీడియాలో ఆ యాడ్‌ వైరల్‌ అవుతుంది. కారణం యాడ్‌లో మహేష్‌ బాబు లుక్‌ సింప్లీ సూపర్బ్‌.


క్రికెట్‌ స్టేడియంలో షూట్‌ చేసిన ఈ యాడ్‌ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. మహేష్‌ బాబు లుక్‌ మరీ ఇందులో రచ్చ రచ్చ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా మహేష్‌ బాబు ఇలాగే కనిపిస్తే మాత్రం సినిమా సూపర్‌ హిట్‌ ఖాయం అంటున్నారు. మహేష్‌ బాబు లుక్‌ మరియు ఆ యాడ్‌ను మీరు ఒక లుక్కేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: