ప్రభాస్ సాహో మూవీకి డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.  టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండటం విశేషం.  కలెక్షన్ల సునామి వలన ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా రూ.370 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  చూస్తుంటే లాంగ్ రన్ లో రూ. 500 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోంది.  డివైడ్ టాక్ వచ్చినా ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి అంటే మాములు విషయం కాదు.  


తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకో నచ్చలేదు.  దీంతో ఇక్కడ సినిమాకు ఆదరణ తగ్గింది.  వరసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో సాహో కలెక్షన్లు ఓహో అనిపించాయి.  ముఖ్యంగా నైజాంలో ఈ సాహో రూ. 26 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.  ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన 5 సినిమా ఇది. ఈ సినిమా పిక్చరైజేషన్ విషయంలో చాలా అడ్వాన్స్డ్ గా ఉంటడం కొంతవరకు గందరగోళానికి తెరితీసింది. 


స్క్రీన్ ప్లే విషయంలోను సినిమా కొంతమందికి అర్ధం కాలేదు.  కొందరైతే ఫ్రెంచ్ సినిమాను కాపీ కొట్టారని.. ఆ కాపీని సరిగా కొట్టి ఉంటె సినిమా మరోలా ఉండేదని అంటున్నారు.  బాలీవుడ్ లోను నెగెటివ్ రివ్యూస్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఆగడం లేదు.  ప్రభాస్ సినిమా కథను, సుజిత్ ను నమ్మి చేశాడు.  సుజిత్ కూడా బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఆ రేంజ్ లోనే సినిమా ఉండాలని అనుకున్నారు.  


కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ నుంచి ఇంకేదో ఊహించి ఉంటారు.  అందుకే సినిమా వాళ్లకు నచ్చక పోయి ఉండొచ్చు.  సుజిత్ ఇటీవలే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.  తన మొదటి సినిమా రన్ రాజా రన్ సినిమా పెద్ద హిట్ కాదు.  సినిమా బాగుంది.. డబ్బులు వచ్చాయి.. తనకు పేరు వచ్చింది. తొందరపడి రివ్యూలు ఇవ్వకుండా ఉండటం వలనే సినిమాకు పేరు వచ్చిందని అన్నారు.  సాహో విషయంలోనూ తొందరపడి రివ్యూలు ఉండకుండా ఉంటె మరోలా ఉండేదో.  తనకు బీహార్ రాష్ట్రం నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారని, సినిమా చాలా బాగుందని చెప్తున్నారని అన్నారు.  బీహార్ లో పుట్టి ఉంటె ఈపాటికి గుడి కట్టేవాళ్లమని బీహార్ కు చెందిన ప్రేక్షకులు చెప్తున్నారని సుజిత్ పేర్కొన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: