హీరోయిన్లంటే నాజూకుగానే ఉండాలి, పాలలా తెల్లగా మెరిసిపోవాలి అనుకుంటారు. అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే హీరోయిన్లుగా తీసుకుంటారు. తెలుగులో ఎంతో మంచి అమ్మాయిలు ఉన్నప్పటికీ, నార్త్ నుండి తీసుకొచ్చి మనమీదే రుద్దే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మన భాష సరిగా పలకలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చూసేస్తుంటాం.


తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు నేర్చుకుని తన క్యారెక్టర్ కి తను డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా వేరే పాత్రలకి కూడా డబ్బింగ్ చెప్పిన వాళ్ళున్నారంటే ఆశ్చర్యమే! పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని నిత్యామీనన్ గురించే. నిత్యామీనన్ "అలా మొదలైంది" సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి చిత్రాలు ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.


ఈ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ  తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో నటించింది. చేసిన పాత్రలు చిన్నవే అయినా తనదైన ముద్ర వేస్తుంది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకుంది.ఇటీవల మిషన్ మంగళ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకొని లక్కీ హీరోయిన్ అని నిరూపించుకున్నారు.కాగా తాజాగా నిత్యా తన చిత్రం యాభైయవ సినిమా కోసం రెడీ అవుతున్నారు.


‘ఆరం తిరుకల్పన’ పేరుతో తెరకెక్కనున్న ఈ మలయాళ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదలయ్యే అవకాశం కలదు. జాతుల వలసలు వంటి ఓ భిన్నమైన కథతో వినూత్నంగా దర్శకుడు అజయ్ దేవలోక తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ని నిత్యా మీనన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, త్వరలో మొదలుకానుంది అని రాయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: