టాలీవుడ్ లో ఈ మద్య కుర్ర హీరోలు, డైరెక్టర్లు తమ సత్తా చాటుతున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా విజయ్ నాని, దేవరకొండ, విష్ణు,రాజ్ తరుణ్ మరికొంత మంది హీరోలు వస్తున్నారు. ఇక సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్న హీరోల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త దర్శకులైనా సూపర్ హిట్ మూవీస్ అందించారు సందీప్ వంగా, అజయ్ భూపతి, సుజిత్ మరికొంత మంది యంగ్ దర్శకులు.  శర్వానంద్ హీరోగా ‘రన్ రాజా రన్’  సినిమాతో మంచి పేరు సంపాదించిన సుజిత్ తర్వాత భారీ ప్రాజెక్ట్ తన భుజంపై వేసుకున్నాడు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సాహూ’ సినిమా తెరకెక్కించారు.  ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాల పెట్టుకొని రిలీజ్ అయ్యింది. కానీ తీరా రిలీజ్ అయిన తర్వాత ఫెయిల్యూర్ టాక్ వచ్చింది. కాకపోతే సినిమా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఈ మద్య ‘సాహూ’ మూవీ లార్గో వించ్ కాపీ అంటూ ఆ సినిమా దర్శకుడు చేసిన విమర్శలపై సీరియస్ అయ్యారు. సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా తన జర్నీని వివరిస్తూ సినిమాను మరోసారి చూడండని పోస్ట్ చేశాడు.

ప్రపంచానికి తెలియకుండా కొడుకును దాచిపెట్టడం అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి.  ఇది కేవలం టాలీవుడ్ లోనే కాదు.. మాఫియా నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు హాలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఎన్నో వచ్చాయి.  కానీ ఎవరి కాన్సెప్ట్ వాళ్లది అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో మొదట ఆగ్రహంతో పోస్ట్ చేయాలనీ అనుకున్నా... కానీ వెంటనే  ఆగిపోయాను.  దానికి కారణం ఈ మూవీని చాలా మంది సెకండ్ టైమ్ చూసాక సినిమా చాలా నచ్చిందని అన్నారు. 

దేశం మొత్తంలో అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించాలి అనేది చాలా కష్టం. ఈ సినిమా ద్వారా పెద్ద హీరోలతో సినిమా చేసేటప్పుడు ఇంటిలిజెన్స్ ని తగ్గించుకొని ప్రతి విషయాన్నీ ఒలిచి చెప్పాలని నేర్చుకున్నా అని సుజిత్ వివరణ ఇచ్చాడు.  ఇది నేను సినిమా కోసం చేసే ప్రమోషన్ కాదని..అర్థం చేసుకుంటారని చెబుతున్నట్లు సుజిత్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: