దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలూ అనూహ్యంగా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకోవడంతో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ మరియు మార్కెట్ ఏర్పడడం జరిగింది. ఇక ఆ రెండు సినిమాలు ఇచ్చిన మంచి ఊపుతో తన తదుపరి సినిమా సాహో ను మొదలెట్టిన ప్రభాస్, ఆ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే విపరీతమైన అంచనాల మధ్య ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ని సంపాదించి, ప్రస్తుతం నత్తనడకన ముందుకు సాగుతోంది. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న సుజీత్ ఈ సినిమాకు దర్శకుడు  కావడం, అలానే మొదటి నుండి సినిమా గురించి యూనిట్ సభ్యులు కూడా ఎంతో పాజిటివిటీ వ్యక్తం చేయడంతో సాహో చాలావరకు అంచనాలు అందుకుంటుందని అందరూ భావించారు. 

ఇక టీజర్, ట్రైలర్లు కూడా హాలీవుడ్ రేంజ్ లో అదరగొట్టడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే, సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెంచుకున్నారు. అయితే తీరా రిలీజ్ తరువాత సాహోలో తాము ఆశించిన అంశాలు ఏమి లేకపోవడం, అలానే విసుగెత్తించే అనసవసరమైన యాక్షన్ సీన్స్, ఏ మాత్రం అందంగా లేని విజువల్ ఎఫెక్ట్స్, సాంగ్స్ వెరసి సాహోకు నెగటివ్ టాక్ ను తెచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ఇతర ప్రాంతాల్లో కూడా సాహో కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయినట్లు సమాచారం. ఇక మొన్నటి సెలవు రోజులైన శని, ఆదివారాలతో పాటు సోమవారం పండుగ దినం కావడంతో సాహో వసూళ్ల జోరు కొనసాగింది. వర్కింగ్ డే అయిన మంగళవారం నుండి ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. 

ఇక తెలుగ సినిమా వాళ్లు ఎంతో గొప్పగా భావించే నైజాం ఏరియాలో కూడా సాహో వసూళ్లు అంత ఆశాజనకంగా లేవని సమాచారం. ఏడవ రోజైన నిన్నటి గురువారం, సాహో నైజాం ఏరియాలో రూ. 52 లక్షల షేర్ రాబట్టింది. దీనితో మొదటి వారం పూర్తయ్యే సరికి నైజాంలో ఇప్పటివరకు రూ. 26 కోట్ల షేర్ రాబట్టింది. ఈ కలెక్షన్ తో సాహోకు నాన్ బాహుబలి రికార్డు దక్కినప్పటికీ, ఇంకా అక్కడ రూ.14 కోట్ల మేర వసూళ్లు సాధిస్తే కానీ, సాహో నైజాంలో బ్రేక్ ఈవెన్ చేరుకోదని, కాగా ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ ని బట్టి చూస్తే, అంత మొత్తం వసూళ్లను రాబట్టే అవకాశం చాలా తక్కువని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: