ఒక పాత్ర కు సంబంధించి ఎన్ని రకాల గెటప్స్ వేయాలన్న రక రకాల ఎక్స్‌పరిమెంట్స్ చేయాలన్న కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా అన్న విషయం అందరికి తెలిసిందే. దశావతారం సినిమాలో ఏకంగా 10 గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బాలయ్య కూడా లేటు వయసులో లేటెస్ట్ గెటప్స్ లో కనిపించి నందమూరి అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నారు. ఇక వాస్తవంగా చెప్పాలంటే మన బాలయ్యకు గెటప్స్ కొత్తకాదు. ఎవరేం అనుకున్నప్పటికీ తను అనుకున్న గెటప్ లోకి మారిపోతాడు. విమర్శల్ని అస్సలు పట్టించుకోడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాడానికి క్షణాల్లో రెడి అయిపోతారు. ఇక తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. 

ఈ సినిమా కోసం ఐరన్ మేన్ టోనీ స్టార్క్ గెటప్ లోకి మారాడు. గెడ్డం, హెయిర్ స్టయిల్ విభిన్నంగా మేకోవర్ చేశారు. ఈ మేకోవర్ చూసి చాలామంది బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే తన పని ఇంతటితో పూర్తవ్వలేదంటున్నాడు బాలయ్య. ఫ్యాన్స్ కోసం సినిమాలో మరో విభిన్నమైన గెటప్ ఉందట. ఆ గెటప్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని తాజా సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ లో భూమికతో కలిసి తెరమీద కనిపించబోతున్నాడు బాలయ్య. దీనికోసం మరో గెటప్ ను సిద్ధంచేసి పెట్టారు.

ఇక ఇలా ప్రతి సినిమాలో రెండు షేడ్స్ లో కనిపించడం బాలయ్యకు అలవాటే. సమరసింహారెడ్డి నుంచి బాలయ్యకు ఇలా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం బాగా అలవాటైంది. కొన్ని సినిమాలు బాగా కలిసొచ్చాయి కూడా. ఇప్పుడు కేఎస్ రవికుమార్ సినిమా కోసం కూడా మరోసారి ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు. ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ అవుతుందని లేటెస్ట్ న్యూస్. బాలయ్య, భూమిక మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత బాలయ్య రెండో అవతారం బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సోనాల్ చౌహాన్ బాలయ్య సరసన మూడోసారి నటిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: