శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కరరావుసమర్పణలో సుంకరబ్రదర్స్‌ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'ధమ్కీ'.. రజిత్‌, త్రిషాలాషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వంవహించారు..రచయిత శ్రీమణి సాహిత్యంఅందిస్తున్న ఈ సినిమా కి ఎస్‌.బి ఆనంద్‌ సంగీతం, దీపక్‌ భగవంత్‌ సినిమాటోగ్రఫీఅందిస్తున్నారు.. ఈ చిత్రం టీజర్‌, బ్యానర్‌లోగోను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. 


వి వి వినాయక్‌ మాట్లాడుతూ - '' సుంకర బ్రదర్స్‌ మా కుటుంబానికి చాలా కావాల్సిన వారు. వాళ్ళ తమ్ముడికి మంచి లైఫ్‌ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో సుంకర బ్రదర్స్‌ ఈ బేనర్‌ని స్థాపించడం జరిగింది. ఫ్యామిలీ వాల్యూస్‌ తెలిసిన వ్యక్తిగా నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే వాళ్ళ తమ్ముడు మంచి స్థాయికి రావాలని, ఈ బ్యానర్‌ సుంకర బ్రదర్స్‌ ఎక్కడున్నా వారందరికి మంచి పేరు తీసుకొచ్చే బ్యానర్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులలోనూ మంచి అన్నదమ్ములు అంటే ఉదాహరణగా మీ ముగ్గురు ఉండాలి. అలాగే ధమ్కీ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం సుంకర బ్రదర్స్‌ బేనర్‌కి మంచి ఫౌండేషన్‌ అవ్వాలని కోరుకుంటున్నా'' అన్నారు. 


ఫైట్‌ మాస్టర్‌ రామ్‌ సుంకర మాట్లాడుతూ - ''మా సుంకర బ్రదర్స్‌ ని ఆశీర్వదించడానికి వచ్చిన వివి వినాయక్‌ గారికి ధన్యవాదాలు. వినాయక్‌ చేతుల మీదుగా మా బ్యానర్‌ లాంచ్‌ అవ్వాలనేది మా ముగ్గురి అన్నదమ్ముల కోరిక. మా అమ్మానాన్నల ఆశిర్వాదంతో ముగ్గురం అన్నదమ్ములం మంచి పేరు సంపాదించాలనే సదుద్దేశంతోనే ఈ బేనర్‌ స్థాపించాం. మా బ్యానర్లో త్వరలోనే మా తమ్ముణ్ణి హీరోగా లాంచ్‌ చేయబోతున్నాం. అలాగే ఈ మూవీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ చాలా సపోర్ట్‌ చేశారు. మా బేనర్‌కి మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 


దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ - '' మా ధమ్కీ మూవీని బ్లెస్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషన్స్‌ ని పరిచయం చేశాను. అందరు మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఇది నా రెండో సినిమా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుంకర బ్రదర్స్‌కి థాంక్స్‌'' అన్నారు. 
హీరో రజిత్‌ మాట్లాడుతూ - '' నన్ను బ్లెస్‌ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుంకర బ్రదర్స్‌ ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సినిమా అవుట్‌ ఫుట్‌ చాలా బాగుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది' అన్నారు. 


సుంకర బ్రదర్స్‌ అభిలాష్‌ మాట్లాడుతూ - ''మా సుంకర బ్రదర్స్‌ బేనర్‌లో ధమ్కీ లాంటి మంచి మంచి మూవీస్‌ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి' అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: