అందం అమ్మాయైతే నీలా ఉంటుందే అనే పాటలు చాలా విన్నాం.  అందమైన అమ్మాయి కనిపిస్తే అలా పడాలని అనుకుంటాం.  కొంతమంది అమ్మాయిల అందం వెనుక.. అందమైన విష వలయం కూడా ఉంటుంది.  వాళ్లకు దొరికితే అందంతో రెచ్చగొట్టి.. పాతాళానికి తొక్కేస్తారు.  అందులో సందేహం లేదు.  అమ్మాయితో ఆట.. పులితో వేట మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.  అనాలోచితంగా అడుగువేస్తే.. మరో అడుగు పడేలోపే మట్టికరిచిపోతారు.  


మన పొరుగుదేశం పాకిస్తాన్ నటీనటుల గురించి మనకు పెద్దగా తెలియదు.  అక్కడ మన ఇండియన్ స్టార్స్ ఫేమస్.  మనదగ్గర ఎలాగైతే ఫేమస్ హీరోయిన్లు ఉన్నారో అక్కడ కూడా ఉన్నారు. అలా తన అందంతో ఆకట్టుకున్న నటీమణిల్లో ఒకరు సోఫియా మీర్జా.  సోఫియా అంటేనే అందం.. ఆ సోఫియా అందం వెనుక చాలా పెద్ద మాఫియా ఉన్నది.  


మనీలాండింగ్, కిడ్నాప్, మోసం వంటి ఎన్నోకేసుల్లో ఆమె హస్తం ఉన్నది.  నేరచరిత్ర ఉన్నది.  అయితే, ఇలాంటి మొదలు కిడ్నాపులు తనకు తెలియవని, విదేశాల్లో ఉన్న తన మాజీ భర్త వలన ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటోంది. ఆమెపై చాలా కేసులు పెండింగులో ఉన్నాయి.  ఇటీవలే ఇస్లామాబాద్ లో అనుమతికి మించి డబ్బును తీసుకెళ్తున్న ఆమెను ఎయిర్ పోర్ట్ లో అధికారులు పట్టుకున్నారు.  ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉన్నది.  


తాజాగా ఆమెపై ఇప్పుడు మనీ లాండింగ్, కిడ్నాప్, మోసం వంటి కేసులు ఫైల్ కావడంతో అందాల తార నేరచరిత్ర బయటకు వచ్చింది.  ఇప్పుడు ఈ నటి ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడంతో తన సినిమా చరిత్ర ఇంతటితో ముగుస్తుందేమో చూడాలి.  అయినా పాక్ లో ఇలాంటివన్నీ మామూలే అని చెప్పొచ్చు.  ఎందుకంటే.. పాకిస్తాన్ నాయకులు అలాంటివారే కదా.  సొంత దేశంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను పక్కన పెట్టి.. పోరుదేశంపై దురుసుగా ప్రవర్తించడం షరా మామూలైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: