హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. స్టార్ హీరో ఛాన్స్ వచ్చినా సరే అది ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన టాలెంట్ తో ఇంప్రెస్ చేస్తే చాలు స్టార్ ఛాన్సులతో పాటుగా స్టార్ క్రేజ్ కూడా వచ్చేస్తుంది. అలా స్టార్స్ పక్కన నటించి స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు.


ఇక వారికి వచ్చిన స్టార్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని వారి రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేస్తున్నారు. సినిమా సినిమాకు రేటు పెంచుతూ దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తారు. అయితే ఇది స్టార్ రేంజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లెక్క. కాని ఇంకా తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోని ఓ హీరోయిన్ తనకు కోటి రెమ్యునరేషన్ కావాలని అంటుందట.


మెంటల్ మదిలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ ఏడాది చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న నివేదా పేతురాజ్ ఈమధ్య ఓ సినిమా కోసం 20 రోజుల డేట్స్ కోసం 70 లక్షల రెమ్యునరేషన్ అడిగిందట. మెంటల్ మదిలో ఆమె లీడ్ హీరోయిన్ కాని మిగతా రెండిటిలో ఆమె సెకండ్ హీరోయిన్ అన్నట్టే లెక్క. రీసెంట్ గా అల్లు అర్జున్, త్రివిక్రం సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుందట.  


ఎలాగు బన్ని లాంటి స్టార్ సినిమా ఛాన్స్ వచ్చింది కదా అని తనకు ఆఫర్ ఇచ్చే నిర్మాతలకు దిమ్మతిరిగే రేటు చెబుతుందట ఈ భామ. నివేదా పేతురాజ్ కు 70 లక్షలు ఇచ్చేకన్నా మరో 30 లక్షలు ఇచ్చి ఫాం లో ఉన్న పూజా, రష్మిక లాంటి వారిని తీసుకోవడం బెటర్ అని భావిస్తున్నారట. ఇప్పటికే నివేదా పేతురాజ్ ఇలానే విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ సినిమా ఆఫర్ వదులుకుందట. రవితేజ డిస్కో రాజా ఛాన్స్ వచ్చినా పారితోషికం వల్ల ఛాన్స్ వదులుకుందట. మరి వచ్చిన అరకొర అవకాశాలు కూడా ఇలా చేజార్చుకుంటే మాత్రం తెలుగులో ఇక కష్టమే అంటున్నారు.
     


మరింత సమాచారం తెలుసుకోండి: